గురువారం 02 ఏప్రిల్ 2020
Jayashankar - Feb 06, 2020 , 03:12:36

తల్లులకు హిజ్రాల మొక్కులు

తల్లులకు హిజ్రాల మొక్కులు

మేడారం బృందం, నమస్తేతెలంగాణ: భక్తుల కొంగు బంగారం.. కోరిన కోర్కెలు నెరవేర్చే తల్లులు.. తమ ఆర్యాధ్య దైవాలు సమ్మక్క-సారలమ్మ అంటూ హైదరాబా ద్‌లోని ఉప్పల్‌, అంబర్‌పేట నుంచి వచ్చిన హిజ్రాలు తన్మయత్వాన్ని చెందారు. మేడారం రెడ్డిగూడెం గ్రామంలో ఏర్పాటు చేసుకున్న గుడారంలో సమ్మక్క-సారల మ్మ ప్రతిరూపాలైన గద్దెలను బంగారంతో అలంకరించారు. నూతన వస్ర్తాలు, తలపా గ, కిరీటం, వడిబియ్యం, మద్యంసీసాలతోపాటు కంకవనం నుంచి సేకరించిన వెదు రు పుల్లలతో తల్లులను సర్వాంగ సుందరంగా అలంకరించారు. సుమారు 30 మంది హి జ్రాలు తమదైన శైలిలో పూజలు చేశారు. నాలుగురోజులపాటు తల్లులకు పూజలు చేసి వనప్రవేశానికి ముందే నిలువెత్తు బంగారాన్ని స మర్పించి తిరిగి హైదరాబాద్‌కు వెళ్తామని తెలిపారు. 


logo