గురువారం 02 ఏప్రిల్ 2020
Jayashankar - Feb 04, 2020 , 02:19:50

మోగిన ఎన్నికల నగారా

మోగిన ఎన్నికల నగారా

జయశంకర్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సహకార ఎన్నికలకు నగారా మోగింది. జిల్లాలోని పది పీఏసీఎస్‌లలో ఈ నెల 15న ఎన్నికలు జరుగనున్నాయి. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌ సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జిల్లాలో పది పీఏపీఎస్‌లు ఉండగా, 31,069 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నెల 6 నుంచి 8 వరకు నామినేషన్ల స్వీకరణ, 9న పరిశీలన, 10న విత్‌ డ్రా, 15న పోలింగ్‌, అదే రోజు ఫలితాల వెల్లడి, 16, 17న అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక నిర్వహించాలని ఈసీ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఇందుకోసం జిల్లాలోని 10 పీఏసీఎస్‌లకు 10 మంది ఎన్నికల అధికారులను నియమించింది. పది పీఏసీఎస్‌లలో ఒక్కో పీఏసీఎస్‌కు 13 ప్రాదేశిక నియోజకవర్గాలు (వార్డులు) ఉంటాయి. 13 ప్రాదేశిక నియోజకవర్గాలకు ఈసీ రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఏడు జనరల్‌ స్థానాలుగా, ఆరు రిజర్వ్‌ స్థానాలుగా కేటాయించింది. సొసైటీల వారీగా ఓటరు జాబితా అందజేసింది. 

ఏర్పాట్లలో అధికారులు..

సహకార ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జిల్లాలోని పది పీఏసీఎస్‌ల పరిధిలో పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు భవనాలను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే పీఏసీఎస్‌లకు ఓటరు జాబితాలు చేరడంతోపాటు ఒక్కో పీఏసీఎస్‌కు ఒక్కో ఎన్నికల అధికారిని ఈసీ నియమించింది. జిల్లాలోని పదకొండు మండలాల్లో పది పీఏసీఎస్‌లు ఉండగా, ప్రతి మండలానికి మరో పీఏసీఎస్‌ను ఏర్పాటు చేసి మొత్తం 22 పీఏసీఎస్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ ఎన్నికలు సమీపించడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. ప్రస్తుతం పది పీఏసీఎస్‌లకు మాత్రమే ఎన్నికలు జరుగనున్నాయి. 

31,069 మంది ఓటర్లు..

జిల్లాలో పది పీఏసీఎస్‌లు ఉండగా 31,069 మంది ఓటర్లు ఉన్నారు. రేగొండ పీఏసీఎస్‌ పరిధిలో 5274 మంది ఓటర్లుండగా, గణపురంలో 4236, చిట్యాలలో 4592, మొగుళ్లపల్లిలో 4914, జంగేడులో 4063, గారెపల్లిలో 2913, మహదేవపూర్‌లో 1185, చెల్పూర్‌లో 1233, మహాముత్తారంలో 1153, తాడిచర్లలో 1417 మంది ఓటర్లున్నారు. ప్రతి పీఏసీఎస్‌లో 13 ప్రాదేశిక నియోజకవర్గాలు (వార్డులు) ఉన్నాయి. ఈ మేరకు పీఏసీఎస్‌లో 13 ప్రాదేశిక నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగనున్నాయి. అభ్యర్థుల గెలుపు అనంతరం అందులో నుంచి అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు. 

రిజర్వేషన్లు ఖరారు..

జిల్లాలో పది పీఏసీఎస్‌లు ఉండగా ప్రతి పీఏసీఎస్‌లో 13 నియోజకవర్గాలు ఉంటాయి. వీటికి రిజర్వేషన్లను ఈసీ ప్రకటించింది. ఏడు జనరల్‌ స్థానాలుగా, ఆరు రిజర్వ్‌ స్థానాలుగా పేర్కొంది. బీసీ 2, ఎస్సీ పురుషులు 1, ఎస్సీ మహిళ 1, ఎస్టీ జనరల్‌ 1, జనరల్‌ మహిళ ఒకటిగా రిజర్వేషన్లు ఖరారు చేసింది. పీఏసీఎస్‌ల వారీగా నియోజకవర్గాల్లో ఖరారు చేసిన రిజర్వేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి. రేగొండ పీఏసీఎస్‌ పరిధిలో ప్రాదేశిక నియోజకవర్గం-1లో ఓసీ, 2లో ఓసీ, 3లో ఎస్టీ, 4లో ఓసీ, 5లో బీసీ, 6లో బీసీ, 7లో ఎస్సీ మహిళ, 8లో ఎస్సీ, 9లో ఓసీ, 10లో ఓసీ మహిళ, 11లో ఓసీ, 12లో ఓసీ, 13లో ఓసీ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. అలాగే గణపురం ప్రాదేశిక నియోజకవర్గం-1లో ఓసీ, 2లో ఓసీ, 3లో ఎస్టీ, 4లో ఎస్సీ, 5లో ఓసీ, 6లో ఎస్సీ మహిళ, 7లో ఓసీ, 8లో ఓసీ, 9లో ఓసీ, 10లో ఓసీ, 11లో బీసీ, 12లో బీసీ, 13లో ఓసీ మహిళ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. చిట్యాల నియోజకవర్గం-1లో ఎస్సీ మహిళ, 2లో ఓసీ, 3లో ఎస్టీ, 4లో ఓసీ మహిళ, 5లో బీసీ, 6లో ఓసీ, 7లో ఓసీ, 8లో ఓసీ, 9లో ఓసీ, 10లో ఓసీ, 11లో బీసీ, 12లో ఎస్సీ, 13లో ఓసీ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మొగుళ్లపల్లి నియోజకవర్గం-1లో ఓసీ, 2లో ఓసీ, 3లో ఓసీ, 4లో ఎస్టీ, 5లో ఓసీ, 6లో బీసీ, 7లో ఓసీ, 8లో ఓసీ మహిళ, 9లో ఓసీ, 10లో ఓసీ, 11లో ఎస్సీ, 12లో ఎస్సీ మహిళ, 13లో బీసీ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జంగేడు నియోజకవర్గం-1లో ఎస్సీ, 2లో బీసీ, 3లో ఓసీ, 4లో ఎస్సీ మహిళ, 5లో ఓసీ, 6లో ఓసీ, 7లో ఓసీ మహిళ, 8లో ఎస్టీ, 9లో ఓసీ, 10లో ఓసీ, 11లో ఓసీ, 12లో ఓసీ, 13లో బీసీ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. గారెపల్లి నియోజకవర్గం-1లో ఓసీ, 2లో ఓసీ, 3లో ఓసీ, 4లో ఓసీ, 5లో ఎస్సీ మహిళ, 6లో ఓసీ, 7లో ఎస్టీ, 8లో బీసీ, 9లో ఓసీ మహిళ, 10లో బీసీ, 11లో ఓసీ, 12లో ఓసీ, 13లో ఎస్సీ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మహదేవపూర్‌ నియోజకవర్గం-1లో ఓసీ, 2లో బీసీ, 3లో ఓసీ, 4లో ఓసీ మహిళ, 5లో ఓసీ, 6లో ఓసీ, 7లో ఓసీ, 8లో బీసీ, 9లో ఓసీ, 10లో ఎస్సీ మహిళ, 11లో ఎస్టీ, 12లో ఎస్సీ, 13లో ఓసీ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. చెల్పూర్‌ నియోజకవర్గం-1లో ఓసీ, 2లో బీసీ, 3లో ఎస్సీ మహిళ, 4లో ఓసీ, 5లో ఓసీ మహిళ, 6లో ఓసీ, 7లో ఓసీ, 8లో ఓసీ, 9లో ఓసీ, 10లో ఓసీ, 11లో ఓసీ, 12లో ఎస్టీ, 13లో బీసీ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మహాముత్తారం నియోజకవర్గం-1లో ఓసీ, 2లో ఓసీ, 3లో ఎస్సీ, 4లో ఓసీ, 5లో ఎస్టీ, 6లో ఓసీ, 7లో ఓసీ, 8లో ఓసీ, 9లో ఓసీ మహిళ, 10లో బీసీ, 11లో ఎస్సీ మహిళ, 12లో ఓసీ, 13లో బీసీ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. తాడిచర్ల నియోజకవర్గం-1లో ఓసీ, 2లో ఓసీ, 3లో ఓసీ, 4లో బీసీ, 5లో ఓసీ, 6లో ఓసీ, 7లో ఓసీ, 8లో ఓసీ, 9లో ఎస్సీ మహిళ, 10లో ఓసీ, 11లో ఓసీ మహిళ, 12లో బీసీ, 13లో ఎస్టీ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. 


logo
>>>>>>