ఆదివారం 24 మే 2020
Jayashankar - Feb 04, 2020 , 02:17:51

బాధ్యతలు స్వీకరించిన నూతన కలెక్టర్‌

బాధ్యతలు స్వీకరించిన నూతన కలెక్టర్‌

కలెక్టరేట్‌, ఫిబ్రవరి 3 : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌గా మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు కలెక్టర్‌గా పనిచేసిన  వాసం వెంకటేశ్వర్లు మేడ్చల్‌-మల్కాజిగిరి కలెక్టర్‌గా బదిలీ కాగా, రాష్ట్ర యూత్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్న మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, విధుల్లో చేరిన కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌కు కలెక్టరేట్‌ సిబ్బంది పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో  వైవీ గణేశ్‌, కలెక్టర్‌ కార్యాలయ ఏవో మహేశ్‌బాబు, జిల్లా అధికారులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.logo