మంగళవారం 31 మార్చి 2020
Jayashankar - Feb 04, 2020 , 02:16:24

సీఎం రాకకు ప్రత్యేక ఏర్పాట్లు

సీఎం రాకకు ప్రత్యేక ఏర్పాట్లు

తాడ్వాయి, ఫిబ్రవరి 3: సీఎం కేసీఆర్‌ మేడారం పర్యటనకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు సోమవారం ములుగు ఇన్‌చార్జి కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌, మేడారం జాతర ప్రత్యేక అధికారి వీపీ గౌతమ్‌ సూచించారు. ఈనెల 7న సీఎంం కేసీఆర్‌ కుటుంబంతో సహా అమ్మవార్ల దర్శనానికి వస్తుండడం, గవర్నర్‌ తమిళసై సౌందర రాజన్‌ అమ్మవార్ల దర్శనానికి వస్తుండడంతో పోలీసు క్యాంపులో చేపట్టిన ఏర్పాట్లను వారు పరిశీలించారు. హెలిప్యాడ్‌, చేపడుతున్న భద్రతా చర్యలను ఎ స్పీ సంగ్రామ్‌సింగ్‌ జీ పాటిల్‌ను అడిగి తెలుసుకున్నారు. వీఐపీ, వీవీఐపీలకు ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. ముఖ్యమంత్రి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెస్ట్‌ రూమ్‌లో ఏర్పాట్లను చూశారు. హెలిప్యాడ్‌ చుట్టూ పటిష్టం గా ఉండేలా ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. వీవీఐపీ, వీఐపీల కోసం నూతనంగా పోలీసు క్యాంపులో నుంచి ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యూలైన్లను పరిశీలించారు. ప్రధాన గేట్‌ నుంచి అమ్మవార్ల గద్దెల వరకు ముందస్తు అనుమతి లేనిదే ఎవరినీ లోనికి అనుమతించవద్దని మేడారం జాతర కార్యనిర్వహణ అధికారి రాజేంద్రాన్ని ఆదేశించారు. గద్దెలను దర్శించుకుని బయటకు వెళ్లేందుకు అధికారులు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు.


logo
>>>>>>