బుధవారం 08 ఏప్రిల్ 2020
Jayashankar - Feb 03, 2020 , 02:19:10

ఆర్టీసీ ప్రయాణం సురక్షితం

 ఆర్టీసీ ప్రయాణం సురక్షితం
  • ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
  • భూపాలపల్లిలో మేడారం జాతర క్యాంపు ప్రారంభం

భూపాలపల్లి టౌన్‌, ఫిబ్రవరి 2 : ఇంధనాన్ని ఆదా చేసి భావితరాతకు అందించాల్సిన అవసరం ఉందని భూపాలపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్‌ లక్ష్మీధర్మ కోరారు. ఆదివారం భూపాలపల్లిలోని అన్ని పెట్రోల్‌ బంక్‌లు, గ్యాస్‌ ఏజెన్సీల నిర్వాహకులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. భూపాలపల్లి బస్టాండ్‌ ముందు ర్యాలీని ఆర్టీసీ డిపో మేనేజర్‌ లక్షీధర్మ జెండాఊపి ప్రారంభించారు. బస్టాండ్‌ నుంచి అంబేద్కర్‌ చౌక్‌, జయశంకర్‌ చౌక్‌ మీదుగా హెచ్‌పీ పెట్రోల్‌ పంప్‌ వరకు కొనసాగింది. ఇంధనాన్ని ఆదా చేద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్‌ మాట్లాడుతూ.. ఇంధనాన్ని ఆదా చేయడం ప్రతి పౌరుడు బాధ్యతగా తీసుకోవాలని కోరారు. ఇంధనాన్ని ఆదా చేస్తే డబ్బులు ఆదా చేసినట్లు మాత్రమే కాదని కాలుషాన్ని సైతం నివారించినట్లవుతుందన్నారు. అంతే కాకుండా ఇంధనాన్ని ఇష్టారాజ్యంగా కాల్చితే భవిష్యత్‌ తరాలకు ఇబ్బందిగా మారుతుందని, అప్పుడు సైకిళ్లు దిక్కవుతాయన్నారు. గ్యాస్‌ను సైతం అవసరం మేరకు వాడుకుని ఆదా చేయాలన్నారు. అనంతరం కౌన్సిలర్‌ గండ్ర హరీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2న ఇంధనం ఆదా దినంగా పాటిస్తున్నామన్నారు. ఇంధనాన్ని పరిమితితో వాడుకోవాలని తద్వారా భవిష్యత్‌ తరాలకు అందించడమే కాకుండా పర్యావరణాన్ని పరిరక్షించినట్లవుతుందన్నారు. ఈకార్యక్రమంలో పెట్రోల్‌ బంక్‌ల నిర్వాహకులు రవీందర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, రమేశ్‌, జ్యోతి, హెచ్‌పీ గ్యాస్‌ నిర్వాహకుడు శ్యాం తదితరులు పాల్గొన్నారు.


logo