గురువారం 09 ఏప్రిల్ 2020
Jayashankar - Feb 03, 2020 , 02:10:23

కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు బదిలీ

కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు బదిలీ
  • జిల్లా కలెక్టర్‌గా మహ్మద్‌ అబ్దుల్‌ అజీం
  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

జయశంకర్‌జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో రాష్ట్ర యూత్‌ స ర్వీసెస్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్న  మహ్మద్‌ అబ్దుల్‌ అజీంను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆధివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. వెంకటేశ్వర్లు కొద్ది కాలంగా భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌గా విజయవంతంగా విధులు నిర్వర్తించారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో జిల్లాను రాష్ట్రంలో ముందు వరుసలో నిలిపి ముఖ్యమంత్రి ప్రశంసలు పొందారు. గిరిజన కుంభమేళా మేడారం జాతర అభివృద్ధి పనులను కూడా కొంతకాలం పర్యవేక్షించారు. జిల్లాలో ప్రభుత్వ ప్రాధాన్యాతాంశాలను సమర్థవంతంగా అమలు చేసిన ఆయన రాష్ట్రంలోని మేడ్చల్‌-మల్కాజిగిరి కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఆయన స్థానం లో మహ్మద్‌ అబ్దుల్‌ అజీంను నియమిస్తూ ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.


logo