మంగళవారం 31 మార్చి 2020
Jayashankar - Feb 02, 2020 , 02:05:09

ఉచితంగా మాస్క్‌ల పంపిణీ

ఉచితంగా మాస్క్‌ల పంపిణీ

తాడ్వాయి/ ఏటూరునాగారం, ఫిబ్రవరి 1: మేడారం సమ్మక్క-సారక్క మహాజాతరలో భాగంగా అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులకు ఓ ఆయిల్‌ కంపెనీ సంస్థ మా స్క్‌లు, ఆఫ్రన్‌లను ఉచితంగా పంపిణీ చేస్తున్నది. జాతర పరిసరాల్లో దుమ్ము లేస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. జాతర పరిసరాల్లో నాలుగు చోట్ల మాస్క్‌ల పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. దుమ్ము ఒంటిపై పడకుండా ఉండేందుకు ఆఫ్రాన్‌లను పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. జాతరలో సంస్థ తరుపున లక్ష మాస్క్‌లతో పాటు లక్ష ఆఫ్రాన్‌లను పంపిణీ చేయనున్నట్లు ఆపరేషన్‌ మేనేజర్‌ రమేశ్‌ తెలిపారు. ఆర్టీసీ బ స్టాండ్‌, చిలుకలగుట్ట, జంపన్నవాగు వద్ద మాస్క్‌లను అందజేస్తున్నట్లు వెల్లడించారు. 


logo
>>>>>>