గురువారం 02 ఏప్రిల్ 2020
Jayashankar - Feb 01, 2020 , 02:26:46

సహకార ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేయాలి

సహకార ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేయాలి

మంజూర్‌నగర్‌, జనవరి 31 : ఈ నెల 15న జిల్లాలో జరిగే వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి టీఆర్‌ఎస్‌ ముఖ్య కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే సహకార ఎన్నికలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మండలంలోని 13 మంది డైరెక్టర్లను గెలిపించాల్సిందిగా మండల నాయకులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలను కోరారు. ప్రభుత్వం చేపడుతున్న ఉచిత విద్యుత్‌ సరఫరా, రైతుబంధు, రైతుబీమా వంటి సంక్షేమ పథకాల అమలును రైతులకు వివరించి సహకార సంఘాల ఎన్నికల్లో పోటీ చేసే డైరెక్టర్లను గెలిపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షులు మందల రవీందర్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ మండల విద్యాసాగర్‌రెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కొత్త హరిబాబు, మాజీ ఎంపీపీ కల్లెపు రఘుపతిరావు, నాగారం సర్పంచ్‌ పిన్‌రెడ్డి రాజిరెడ్డి, వైస్‌ ఎంపీపీ సముద్రాల దీప శ్రీనివాస్‌, పింగిళి రవీందర్‌రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. 


logo
>>>>>>