మంగళవారం 07 ఏప్రిల్ 2020
Jayashankar - Jan 31, 2020 , 04:23:37

తల్లుల సన్నిధిలో బారులుతీరిన భక్తులు

తల్లుల సన్నిధిలో బారులుతీరిన భక్తులు
  • ఒక్కరోజే 3.50 లక్షల మంది రాక

తాడ్వాయి/ ములుగుటౌన్‌, జనవరి 30: ఆదివాసీ గిరిజన దైవాలు మేడారం సమ్మక్క-సారక్క దీవెనలు పొందేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. అమ్మవార్ల నామస్మరణతో తల్లుల గద్దెల ప్రాంగణం మార్మోగుతున్నది. గురువారం సుమారు 3.50 లక్షల మంది అమ్మవార్లను దర్శించుకున్నారు. జంపన్నవాగులో స్నానాలు చేసి కల్యాణకట్టలో తలనీలాలు ఇచ్చారు. గద్దెల వద్దకు చేరుకుని సమ్మక్క-సారక్క, గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దెలపై పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం, నూతన వస్ర్తాలు, పూలు, పండ్లు, చీరె, సారె, ఒడిబియ్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. మేడారం ప్రతీ వీధి భక్తులతో కిటకిటలాడింది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు గుడి ముసివేసినందున గురువారం ఉదయం 6గంటల నుంచి భక్తుల సంఖ్య గంట గంటకూ పెరిగింది. వనదేవతలను ప్రొఫెసర్‌ కోదండరాం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. 


logo