బుధవారం 08 ఏప్రిల్ 2020
Jayashankar - Jan 31, 2020 , 04:20:38

జంపన్నవాగుకు చేరిన లక్నవరం నీరు

జంపన్నవాగుకు చేరిన లక్నవరం నీరు
  • జాతరకు వారం రోజుల ముందే నీరు చేరడంతో భక్తుల ఆనందం
  • పసుపు, కుంకుమలు సమర్పించి పూజలు

ములుగుటౌన్‌, జనవరి 30: మేడారం వచ్చే భక్తులు స్నానాలు చేసేందుకు గోవిందరావుపేట మండలం లక్నవరం సరస్సు నుంచి అధికారులు నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు లక్నవరం నీరు జంపన్నవాగులోకి గురువారం చేరింది. రెడ్డిగూడెం వైపు ఉన్న లోలెవల్‌ కాజ్‌వే పై నుంచి నీరు ప్రవహించింది. నీరు జంపన్నవాగులోకి చేరడంతో భక్తులు, చిన్నారులు నీటిలో జలకాలాడుతూ ఉత్సాహంగా గడిపారు. వారం ముందే లక్నవరం నీరు జంపన్నవాగులోకి చేరగా, భక్తులు వాగు నీటిని తలపై చల్లుకున్నారు. పసుపు, కుంకుమ వాగులో చల్లి, కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. 


logo