గురువారం 02 ఏప్రిల్ 2020
Jayashankar - Jan 30, 2020 , 02:54:41

మేడారం ఉత్సవానికి ఆహ్వానం

మేడారం ఉత్సవానికి ఆహ్వానం
  • జాతరకు రావాలని మంత్రి కేటీఆర్‌ను కోరిన మంత్రులు
  • ఆహ్వాన పత్రికను అందించిన ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌
  • గవర్నర్‌కు అందజేసిన గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి

  ములుగు జిల్లా ప్రతినిధి/నమస్తే తెలంగాణ : తెలంగా ణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మేడా రం సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు రావాలని కోరు తూ రాష్ట్ర గవర్నర్‌ తమిళి సై సౌందర్‌ రాజన్‌ను ఆ హ్వానించారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌, ఆ శాఖ కార్యదర్శి బెనహర్‌ మహేశ్‌దత్‌ఎక్కా, కమిషనర్‌ క్రిస్టినా జెడ్‌ చోం గ్తూలు పోచంపల్లి చేనేత శాలువా కప్పి సంప్రదాయ వెం డికుంకుమ భరణిని అందించి 2020 మేడారం జాతర ఆ హ్వాన పత్రికను అందజేశారు. అలాగే తల్లుల ప్రసాదమైన బంగారాన్ని ఆహ్వాన పత్రికతోపాటు అందించారు. మే డారం చరిత్ర, విశిష్టతను తెలిపే విధంగా ఆహ్వాన పత్రికను రూపొందించిన తీరును మంత్రి సత్యవతిరాథోడ్‌కు గవ ర్నర్‌కు వివరించారు. సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం జాతరలో చేపట్టిన కార్యక్రమాలు, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్లాస్టిక్‌ నివారణకు తీసుకున్న చర్యల గురించి ఆమెకు వివరించారు. 


logo