శనివారం 28 మార్చి 2020
Jayashankar - Jan 29, 2020 , 02:22:44

లక్నవరం అందాలకు ఫిదా

లక్నవరం అందాలకు ఫిదా

గోవిందరావుపేట, జనవరి 28: లక్నవరం సరస్సు అందాలు బాగున్నాయని పర్యాటకులు చెప్పారు. ఆ సరస్సును మంగళవారం పెద్ద సంఖ్యలో పర్యాటకులు సందర్శించారు. మేడారం వచ్చిన వారు తిరుగు ప్రయాణంలో లక్నవరం సందర్శించేందుకు వచ్చారు. ఈ క్రమంలో పోలీసులు రహదారిపై రాకపోకలను నిలిపేశారు. దీంతో పర్యాటకులు, సిబ్బంది మధ్య వా గ్వాదం జరిగింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులను నిలిపేయడం సరికాదని వారు చెప్పారు. కాగా, కొందరు పర్యాటకులు గ్రామంలోని ఓ రహదారి వెంట వెళ్లి లక్నవరం అందాలను తిలకించడం గమనార్హం.

నేటి నుంచి సందర్శన బంద్‌..

నేటి నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు లక్నవరం సందర్శనను నిలిపేస్తున్నట్లు పస్రా ఎస్సై మహేందర్‌కుమార్‌ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. జాతర సమయంలో సంఘటనలు చోటు చేసుకుండా ముందస్తుగా సందర్శనను నిలిపివేస్తున్నట్లు వివరించారు. ఫిబ్రవరి 5 నుంచి జరిగే మేడారం జాతర దృష్ట్యా భక్తులు ముందస్తుగా వచ్చి మొక్కులు చెల్లించి తిరుగు ప్రయాణంలో లక్నవరం సందర్శిస్తున్నారని, దీంతో ట్రాఫిక్‌ జామ్‌ అవుతోందని తెలిపారు. పర్యాటకులు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా సందర్శనను నిలిపివేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు. పోలీస్‌ శాఖ, టూరిజం శాఖకు పర్యాటకులు సహకరించాలని కోరారు.


logo