ఆదివారం 24 మే 2020
Jayashankar - Jan 29, 2020 , 02:21:50

హెల్మెట్‌ ధరించి ప్రాణాలు రక్షించుకోండి

హెల్మెట్‌ ధరించి ప్రాణాలు రక్షించుకోండి

కలెక్టరేట్‌, జనవరి 28 : హెల్మెట్‌ ధరిం చి ప్రాణాలు రక్షించుకోవాలని కలెక్టర్‌ వా సం వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం జాతీయ రహదారి భద్రత 31వ వార్షికోత్సవంలో భాగంగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆర్టీసీ, రవాణాశాఖ, పోలీసుశాఖ, లెక్చరర్స్‌తో కలిసి కలెక్టర్‌ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ జిల్లా కలెక్టర్‌ కా ర్యాలయం నుంచి పట్టణ కేంద్రంలోని హ నుమాన్‌ టెంపుల్‌ వరకు సాగింది. ఈ సం దర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ స మాజంలో ప్రతి పౌరుడు రహదారి భద్ర త పాటించి జీవితానికి రక్షణ పొందాలన్నా రు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించాలని, కారులో ప్రయాణించే వారు సీట్‌ బెల్టును తప్పక పెట్టుకోవాలని సూ చించా రు. ట్రాఫిక్‌ నియమాలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాలు జరుగకుండా తగిన జా గ్రత్త లు తీసుకోవాలని కోరారు. ఆర్టీఏ ని యమాలు పాటిస్తే ప్రమాదాలను తగ్గించవచ్చ ని తెలిపారు. ప్రమాద రహిత జిల్లాగా మా ర్చేందుకు జిల్లాలోని యువతీయువకులు తప్పకుండా హెల్మెట్‌ ధరించి తమ ప్రాణాలను రక్షించుకోవాలని సూచించారు. అ నంతరం ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కువగా రో డ్డు ప్రమాదాలే చోటు చేసుకుంటున్నాయ ని, వాహనాలను వేగానికి మించి నడుపకుండా నిదానంగా గమ్యస్థానాలకు చేరుకోవాలన్నారు.  తప్పకుండా డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి ఉం డాల ని, మద్యం సేవించి వాహనాలు నడుపవద్దని సూచించారు. టూ వీలర్‌పై ఇద్దరికన్నా ఎక్కువ మంది ప్రయా ణం చేయవద్దని, డ్రైవింగ్‌ చేస్తూ సెల్‌ఫోన్‌లో మాట్లాడవద్దని, వాహనాలు మలుపు తిరిగేటప్పుడు తప్పనిసరిగా సిగ్నల్స్‌ ఇవ్వాలని సూచించారు. ర్యాలీ అనంతరం హ నుమాన్‌ టెంపుల్‌కు వెళ్లి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించా రు. కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్‌ స్వామి, జిల్లా రవాణాశాఖ అధికారి వేణు, డీఎస్పీ సంపత్‌రావు, సింగరేణి ఏరియా అధికార ప్రతినిధి మంచాల శ్రీనివాస్‌, సీఐలు, ఎ స్సైలు, సింగరేణి రెస్క్యూ సిబ్బంది, కార్మికులు, డాక్టర్లు, లెక్చరర్స్‌ పాల్గొన్నారు. logo