సోమవారం 06 ఏప్రిల్ 2020
Jayashankar - Jan 29, 2020 , 02:20:55

రామప్ప రెడీ..

రామప్ప రెడీ..

వెంకటాపూర్‌ జనవరి 28 : మేడారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న భక్తులు తిరుగు ప్రయాణంలో మండలంలోని చారిత్రక రామప్ప రామలింగేశ్వరు డిని దర్శించుకునేందుకు వీలుగా ఆలయ అధికారులు, రెవెన్యూ, పోలీసుశాఖ తదితర శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.  సుమారు 8లక్షలకుపై గా భక్తులు రామప్పకి వస్తారని అధికారుల అంచనా.  భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని సకల ఏర్పాట్లు చేస్తున్నారు. మరో వా రం రోజుల్లో రామప్ప భక్తుల రద్దీతో కిటకిటలాడనుంది. 

రామలింగేశ్వరుడి సేవలో

 అధికార  యంత్రాంగం

మేడారం సమ్మక్క-సారలమ్మల భక్తు లు తిరుగు ప్రయాణంలో రామప్ప దేవాలయాన్ని దర్శించుకోనున్న  నేపథ్యంలో  తహసీల్దార్‌  కిశోర్‌కుమార్‌, ఎంపీడీవో  క ర్నాటి శ్రీధర్‌, డిప్యూటీ తహసీల్దార్‌ రాజునాయక్‌, ఆర్‌ఐ సునీల్‌, ఏవో కల్యాణీ, ఏ పీవో సునీత, సీనియర్‌ అసిస్టెంట్‌ పార్థసారథి, జూనియర్‌ అసిస్టెంట్‌ వినాయక్‌, టైపి స్టు గోపీధర్‌, వీఆర్‌వోలతోపాటు అన్ని శా ఖల అధికార యంత్రాంగం నాలుగు రోజు ల పాటు రామప్పలో విధులు నిర్వర్తించనున్నారు.  రామప్పలో భక్తుల సౌకర్యార్థం   విధులు నిర్వర్తించే  అవకాశం కల్పించడం ఆనందంగా ఉందని అధికారులు పేర్కొంటున్నారు. సమ్మక్క-సారక్కల సేవలో తరించి రామప్పకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తాము జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. 

రూ. 5లక్షలతో వసతులు..

మేడారం భక్తుల రాక  సందర్భంగా  స ర్పంచ్‌ డోలి రజిత శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో రామప్పలో తాత్కాలిక మరుగుదొడ్లు, వా టర్‌ ట్యాంకులు, తదితర వసతులు ఏర్పా టు చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో అ న్ని పనులు పూర్తవుతాయి.  దాదాపు 8 ల క్షలకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తమవుతున్నారు. 

రామప్పలో 300మంది 

పోలీసుల బందోబస్తు

రామప్పలో 300మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎస్సై భూక్య నరహరి తెలిపారు. భక్తులకు ఎ లాంటి బ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు పెట్రోలింగ్‌ నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. అంతే కాకుండా రామప్పలో మద్యం సేవించొద్దని భక్తులకు సూ చించారు. అలాగే రామప్ప సరస్సులో మొ సళ్లు ఉన్నాయని, అందులో దిగి స్నానాలు చేయొద్దని భక్తులకు సూచించారు. ఏ  సమస్య  తలెత్తిన తమ సిబ్బందికి తెలియపరుచాలని ఎస్సై విజ్ఞప్తి చేశారు. 


logo