ఆదివారం 29 మార్చి 2020
Jayashankar - Jan 29, 2020 , 02:17:57

పార్టీకి ద్రోహం చేస్తే ఉపేక్షించం

పార్టీకి ద్రోహం చేస్తే ఉపేక్షించం

భూపాలపల్లి టౌన్‌, జనవరి 28 : టీఆర్‌ఎస్‌ పార్టీలో పని చేస్తూ పార్టీకి ద్రోహం చేస్తే ఉపేక్షించేది లేదని వరంగల్‌ రూరల్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి హెచ్చరించారు. గడిచిన మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన పెద్దిరెడ్డి దేవేంద్ర, గుమ్మడి భాగ్యలక్ష్మి, తుమ్మేటి సుచరిత, రేగుల రాకేశ్‌, గోనె భాస్కర్‌ల ఇళ్లలోకి వెళ్లి పరామర్శించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఓడిపోయినందుకు బాధపడవద్దని కోరారు. పార్టీలో నమ్మకంగా పని చేసే వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఓడిపోయిన పలువురు అభ్యర్థులు పార్టీలోని కొందరు నాయకులు చేసిన ద్రోహం వల్లే ఓడిపోయామని గండ్ర జ్యోతికి విన్నవించారు. ఈ విషయమై జ్యోతి మాట్లాడుతూ పార్టీలో పని చేస్తూ పార్టీకి ద్రోహం చేసే వారిని ఉపేక్షించేది లేదన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటమిపాలైన టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గురించి ఆరా తీస్తున్నామని, ఆయా వార్డుల్లో ఓటమికి గల కారణాలను అన్వేషిస్తున్నామన్నారు. పార్టీ నాయకులు ద్రోహం చేసినట్లు తేలితే  అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామన్నారు. వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవన్నారు. టీఆర్‌ఎస్‌ అర్బన్‌ అధ్యక్షుడు క్యాతరాజు సాంబమూర్తి, నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. 


logo