మంగళవారం 31 మార్చి 2020
Jayashankar - Jan 27, 2020 ,

జిల్లా అభివృద్ధికి పునరంకితమవుదాం

జిల్లా అభివృద్ధికి పునరంకితమవుదాం

జయశంకర్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ :జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా అభివృద్ధికి మరోసారి పునరంకితమవుదామని జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ క్రీడా మైదానంలో జరిగిన 71వ రిపబ్లిక్‌ డే వేడుకలకు కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జాతీయ జెండా ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. విద్యార్థినీ విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు తిలకించారు. ఆయా డిపార్ట్‌మెంట్లకు చెందిన శకటాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఉత్తమ ఉద్యోగులను, స్వాతంత్య్ర సమరయోధులను కలెక్టర్‌ సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాకు అపార భవిష్యత్‌ ఉందని, ముఖ్యంగా పర్యాటక ప్రాంతంగా భూపాలపల్లి అభివృద్ధి చెందనుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావడంతో రోజురోజుకూ పర్యాటకుల తాకిడి పెరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధతో కాళేశ్వర ముక్తీశ్వరాలయాన్ని అభివృద్ధి చేస్తున్నారని, ఈ క్రమంలో కాళేశ్వరం వద్ద పర్యాటకుల విడిది కోసం హరితహోటల్‌, ఆహ్లాదం కోసం ముక్తి వనాన్ని సిద్ధం చేశారన్నారు. కోటగుళ్ల వద్ద రూ.3.71కోట్లతో, పాండవులగుట్ట వద్ద రూ.1.09కోట్లతో మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు. భూపాలపల్లి పట్టణంలో హరిత హోటల్‌ నిర్మాణం కోసం స్థల పరిశీలన జరుగుతుందని, పట్టణంలో అటవీ ప్రాంతానికి ఆనుకొని నూతనంగా అటవీశాఖ ద్వారా అర్బన్‌ పార్కును ఏర్పాటు చేశామని, త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు. 

స్వయం ఉపాధికి ప్రోత్సాహం..

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లోని నిరుపేద యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యం తో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా 2017-18 సంవత్సరంలో రూ.6.12 కోట్ల సబ్సిడీతో 500మంది ఎస్సీ యువతకు ఉపాధి చూపించామని కలెక్టర్‌ తెలిపారు. బీసీ కార్పొరేషన్‌ ద్వారా రూ.5.23కోట్లతో 1049 మందికి, గిరిజన సంక్షేమశాఖ ద్వా రా రూ.2.40కోట్ల సబ్సిడీతో 221మంది గిరిజన యువతకు స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేశామన్నారు. కల్యాణలక్ష్మీ ద్వారా 5809 మంది లబ్ధిదారులకు రూ.43.97కోట్లు, షాదీముబారక్‌ పథకం ద్వారా 260మంది లబ్ధిదారులకు రూ.1.91కోట్లు అందించామన్నారు. జిల్లాలో 512అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా 19,027 మంది ఆరేళ్లలోపు చిన్నారులు, 4366 మంది బా లింతలు, గర్భిణులకు ప్రతిరోజు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నామని కలెక్టర్‌ వివరించారు. జిల్లాలో స్వచ్ఛభారత్‌ కార్యక్రమం ద్వారా చేపట్టిన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యం వందశాతానికి చేరి జిల్లాను బహిరంగ మల మూత్ర విసర్జన రహిత (ఓడీఎఫ్‌) జిల్లాగా ప్రకటించడం జరిగిందన్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ, పట్ట ణ ప్రాంతంలో 1800 గ్రూపులకు రూ.68.70 కోట్ల బ్యాంకు లింకేజీ రుణం, స్త్రీ నిధి ద్వారా 1247 సంఘాలకు రూ.7.51 కోట్లు అందించ డం జరిగిందన్నారు. జిల్లాలో అన్ని రకాల పింఛన్‌దారులకు ప్రతినెలా రూ.13.51 కోట్ల పింఛన్‌ అందిస్తున్నట్లు తెలిపారు. నీతి ఆయోగ్‌ విడుదల చేసే అభివృద్ధి ర్యాంకింగ్‌లో గతేడాది మార్చి మాసంలో దేశంలోనే జిల్లా మొదటి ర్యాంకు పొందిందన్నారు. అలాగే అక్టోబర్‌ నెలలో విద్యా విభాగంలో మొ దటి స్థానం పొంది జిల్లా అభివృద్ధి పతంలో ముం దుకు సాగుతుందన్నారు. నిరుపేదలు సౌకర్యవంతమైన ఇంటిలో నివసించడమే లక్ష్యంగా ప్రభు త్వం చేపట్టిన డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల పథకం ద్వారా జిల్లాలో 3880 ఇం డ్లు మంజూరు కాగా ఇప్పటికే రూ.60 కోట్లు వె చ్చించి 607 ఇంటి నిర్మాణాలు పూర్తి చేశామన్నా రు. మిగిలినవి వివి ధ నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. మిషన్‌ భగీరథ ద్వారా మంథని, భూపాలపల్లి సెగ్మెంట్‌ ద్వా రా చేపట్టిన 992కిలోమీటర్ల మెయిన్‌ పైపులైన్‌ నిర్మాణం, గ్రామాల్లో 1,004 కిలోమీటర్ల అంతర్గత పైపులైన్ల నిర్మాణం, నల్లాల బిగింపు పూర్తయి జిల్లాలో గల 410 ఆవాసాల్లోని 1,06,712 గృ హాలకు శుద్ధనీరు అందించడం జరుగుతుందన్నా రు. వృక్ష సంపదను పెంపొందించుటకు ఈ సంవత్సరానికిగాను కోటి 5లక్షల మొ క్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 90 లక్షల మొక్కలు నాటినట్లు ఆయన తెలిపారు.  భూ రికార్డుల శుద్ధీకరణ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 1,92,342 పట్టాదారు పాస్‌ పుస్తకాలను అందించామని కలెక్టర్‌ వెంకటేశ్వర్లు వివరించారు. గ్రా మాలను సమగ్రంగా అభివృద్ధి పరచాలనే ఉద్దేశం తో సెప్టెంబర్‌ 6 నుంచి నెల రోజులపాటు, జనవ రి 2 నుంచి పది రోజుల పాటు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించి గ్రామాల్లో యేళ్లుగా పేరుకుపోయిన చెత్తాచెదారం తొలగించామన్నారు. రూ ర్బన్‌ మిషన్‌ ద్వారా భూపాలపల్లి మండలంలోని నాగారం క్లస్టర్‌ను ఎంపిక చేసుకొని రూ.63.38 కోట్ల అంచనా వ్యయంతో గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. నిరంతర నాణ్యమైన విద్యుత్‌ సేవలు అందించడంలో భాగంగా జిల్లాలో రూ.18.70 కోట్లు ఖ ర్చు చేసి వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యు త్‌ సరఫరాకు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. జిల్లాలో ఆర్‌అండ్‌బీ శాఖ ద్వారా రహదారుల అభివృద్ధికి రూ.484.45 కోట్లతో పనులు చేపట్టగా ఇప్పటివరకు రూ.225.82 కోట్లు ఖర్చు చేసి 95కిలోమీటర్ల సింగిల్‌లైన్‌ రోడ్డును డబుల్‌లైన్‌ రోడ్డుగా మార్చామన్నారు. 89.53కిలోమీటర్ల గ్రామీణ రోడ్డు నిర్మాణం, 16వంతెనల నిర్మాణం చేపట్టామన్నారు. భూపాలపల్లి పట్టణాభివృద్ధికి రూ.43.11కోట్లు మంజూరు కాగా, వాటిలో ఇప్పటికే రూ.33.16 కోట్లు ఖర్చు చేసి అంతర్గత రోడ్లు, కాల్వలు, సెంట్రల్‌ లైటింగ్‌, తదితర సౌకర్యాలు కల్పించామన్నారు. జిల్లా అభివృద్ధికి అధికారులు, ప్రజలు సహకరించాలని, భవిష్యత్‌లో అభివృద్ధిలో ముందుకు సాగుదామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ జక్కు శ్రీహర్షిణి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా అడిషనల్‌ ఎస్పీ శ్రీనివాసులు, ఓఎస్డీ శోభన్‌కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ కూరాకుల స్వర్ణలత, డీఎఫ్‌వో, జిల్లా యువజన, క్రీడల శాఖాధికారి కే పురుషోత్తం, ఏఎస్పీ శ్రీనివాసులు, ఆర్డీవో వైవీ గణేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo
>>>>>>