మంగళవారం 07 ఏప్రిల్ 2020
Jayashankar - Jan 26, 2020 , 03:20:22

టీఆర్‌ఎస్‌కు జై!

టీఆర్‌ఎస్‌కు జై!
  • భూపాలపల్లిలో గులాబీ ప్రభంజనం
  • మున్సిపాలిటీలో దుమ్మురేపిన కారు
  • 30 వార్డుల్లో 23 కైవసం
  • ఏఐఎఫ్‌బీకి 3, సీపీఐకి 2,
  • బీజేపీ, స్వతంత్ర అభ్యర్థికి చెరొకటి..
  • కాంగ్రెస్‌ అడ్రస్‌ గల్లంతు
  • టీఆర్‌ఎస్‌ శ్రేణుల సంబురాలు
  • భూపాలపల్లిలో గులాబీ ప్రభంజనం
  • మున్సిపాలిటీలో దుమ్మురేపిన కారు
  • 30 వార్డుల్లో 23 కైవసం
  • ఏఐఎఫ్‌బీకి 3, సీపీఐకి 2,
  • బీజేపీ, స్వతంత్ర అభ్యర్థికి చెరొకటి..
  • కాంగ్రెస్‌ అడ్రస్‌ గల్లంతు
  • టీఆర్‌ఎస్‌ శ్రేణుల సంబురాలు



పురపోరులో టీఆర్‌ఎస్‌ ప్రభంజనం కొనసాగింది. ఎన్నికలేవైనా గెలుపు టీఆర్‌ఎస్‌దేనని మరోసారి రుజువైంది. భూపాలపల్లిలో కారు దుమ్ము రేపింది. మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగిరింది. టీఆర్‌ఎస్‌ దెబ్బకు ప్రతిపక్షాల అడ్రస్‌ గల్లంతైంది. కాంగ్రెస్‌ పార్టీ ఉనికి శూన్యమైంది. శనివారం జరిగిన ఓట్ల లెక్కింపులో టీఆర్‌ఎస్‌ హవా కొనసాగింది. భూపాలపల్లి మున్సిపాలిటీలో 30 వార్డులుండగా, 23 స్థానాలను టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకుంది. స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన ఒకరు కూడా గులాబీ పార్టీలో చేరారు. ఇక ఏఐఎఫ్‌బీ 3, సీపీఐ 2, బీజేపీ ఒక స్థానంతోనే సరిపెట్టుకున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ  నుంచి 23 మంది బరిలో నిలిచినా కనీసం ఖాతా  తెరవలేదు. ఏకపక్షంగా ఫలితాలు రావడంతో గులాబీ శ్రేణుల్లో సంబురాలు అంబరాన్నంటాయి .


జయశంకర్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఎన్నికలేవైనా టీఆర్‌ఎస్‌ వెంటే మేమం టూ ప్రజలు ప్రకటిస్తూ తీర్పునిస్తున్నారు. ము న్సిపల్‌ ఫలితాల్లోనూ భూపాలపల్లి ప్రజలు టీఆర్‌ఎస్‌కు జైకొట్టారు. శనివారం వెలువడిన ఫలితాల్లో టీఆర్‌ఎస్‌ విజయ బావుటా ఎగరే సింది. ఆది నుంచి వస్తున్న దూకుడును కొనసాగించింది. టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజల్లో ఆనందం వెల్లివిరిసింది. ఉద్యమ నేత సీఎం కేసీఆర్‌, రాష్ట్ర పార్టీ గౌరవాధ్యక్షులు కల్వకుంట్ల తారకరామారావు ఇచ్చిన స్ఫూర్తితో ప్రజలు విలక్షణమైన తీర్పునిచ్చారు. భూపాలపల్లి మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరడంతో నాయకులు, కార్యకర్తలు ఆనందాల్లో మునిగితేలుతున్నారు. సింగరేణి ప్రాంతమైన భూపాలపల్లి ఒకప్పుడు అన్ని రాజకీయ పార్టీలకు నిలయం. కానీ, తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చాక పొలిటికల్‌ వార్‌ వన్‌సైడ్‌ అయింది. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో విలీనమయ్యారు. దానికి స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నాయకత్వం వహించారు. ఆ తర్వాత ఎన్నో రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నప్పటికీ భూపాలపల్లి ప్రాంత ప్రజలు పార్టీలకతీతంగా టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటిస్తూ బాసటగా నిలిచారు. ప్రతి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి బలపర్చిన అభ్యర్థులను గెలిపిస్తూ వస్తున్నారు. పార్లమెంట్‌, శాసనసభ ఎన్నికల నుంచి మొదలు ఆ తర్వాత వచ్చిన జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో టీఆర్‌ఎస్‌ జెండా ఎగిరింది. అన్ని స్థాయిల్లోని పదవులను చేజిక్కించుకుంది. ప్రజలు మంచి మెజార్టీని అందించారు. ఇదే క్రమంలో భూపాలపల్లిలోని ఏకైక మున్సిపాలిటీకి ఎన్నికలు జర గ్గా శనివారం ఫలితాలు విడుదలయ్యాయి.

ఈ ఫలితాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి మరోసారి విజయఢంకా మోగించింది. భూపాలపల్లి ము న్సిపాలిటీ పరిధిలో 30 వార్డులు ఉండగా వా టిలో తొమ్మిదో వార్డు నామినేషన్ల ఘట్టం చివరి రోజే ఏకగ్రీవమైంది. ఇక 29 వార్డుల్లో తెలంగాణ రాష్ట్ర సమితి మరో 22 వార్డులను గెలుచుకుంది. ఇంకొ వార్డులో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందగా భారతీయ జనతా పార్టీ మరొక వా ర్డులో, ఏఐఎఫ్‌బీ మూడు వార్డుల్లో, సీపీఐ 2 వార్డుల్లో గెలుపొందాయి. గతానికి భిన్నంగా కాంగ్రెస్‌, టీడీపీ లాంటి ప్రతిపక్షాలకు స్థానం లేకుండా చేస్తూ టీఆర్‌ఎస్‌ మున్సిపల్‌ ఎన్నికల బరిలోకి దిగింది. వ్యూహాత్మకంగా ఫలితాలు సాధించి ప్రజల మన్ననలు పొందడంలో మరో అడుగు ముందుకేసింది. టీఆర్‌ఎస్‌ దూకుడుకు తగినట్లుగా ప్రజల ఆశీర్వాదం లభించడంతో భూపాలపల్లి మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరేసింది.



logo