గురువారం 09 ఏప్రిల్ 2020
Jayashankar - Jan 26, 2020 , 03:15:16

ఫలించిన పక్కా వ్యూహం

ఫలించిన పక్కా వ్యూహం
  • -కేసీఆర్‌, కేటీఆర్‌ డైరెక్షన్‌లో ఎగిరిన గులాబీ జెండా
  • -భూపాలపల్లి మున్సిపల్‌లో 23 స్థానాలు కైవసం


జయశంకర్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మున్సిపల్‌ ఎన్నికలపై సీఎం కేసీఆర్‌, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ మార్క్‌ కనిపించింది. వీరిద్దరి డైరెక్షన్‌లో రాష్ట్రంలోని ఆయా పుర ఎన్నికల్లో ఎ మ్మెల్యేలు, ఇన్‌చార్జులు ముందుకుసాగి విజయం సాధించారు. గులాబీ జెండాలను రెపరెపలాడించారు. రాష్ట్రంలోని ఎనిమిది కార్పొరేషన్లను పూ ర్తిగా కైవసం చేసుకోగా 120 మున్సిపాలిటీలకు 109 మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ పాగా వేసింది. ఎన్నికలు ఏవైనప్పటికీ గెలుపు గులాబీదేనని మరోమారు నిరూపణ అయింది. ఇప్పటివరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచుల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు భారీ మెజార్టీతో అధికసంఖ్యలో గెలుపొందారు. ప్రస్తుతం జరిగిన పురపోరులోనూ కారు దూసుకెళ్లింది. దీంతో ప్రతిపక్షాలకు చెమటలు పడుతున్నాయి. భూపాలపల్లి మున్సిపాలిటీలో 30 వార్డులకు గానూ 23 వా ర్డులు టీఆర్‌ఎస్‌ ఖాతాలో వేసుకుంది. మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌, మం త్రి కేటీఆర్‌ ప్రత్యేక వ్యూహ రచన చేశారు. ప్రతి కా ర్పొరేషన్‌, మున్సిపాలిటీకి నియోజకవర్గ ఎమ్మెల్యేలతో పాటు ఇన్‌చార్జులను నియమించారు. అభ్యర్థుల ఎంపికల్లో ప్రత్యేక దృష్టిసారించారు. నిత్యం నియోజకవర్గ ఎమ్మెల్యేలతో, ఇన్‌చార్జులతో టచ్‌ లో ఉంటూ ఫాలోఅప్‌ చేశారు. మున్సిపాలిటీలో తొమ్మిదో వార్డు టీఆర్‌ఎస్‌కు ఏకగ్రీవమైంది. మరో 22 స్థానాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. కాం గ్రెస్‌ ఒక్క స్థానంలో గెలవలేకపోయింది. బీజేపీ ఒక్క సీటుతో సరిపెట్టుకుంది.

గులాబీ గుబాళింపు

సీఎం కేసీఆర్‌ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి చొచ్చుకెళ్లడంతోనే టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు సులభతరమైంది. భూపాలపల్లిలో కారు స్పీడ్‌ పెరిగింది. 30 వార్డులకు గానూ 23 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయఢంకా మోగించారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ అనునిత్యం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఇన్‌చార్జులతో మాట్లాడుతూ సూచనలు, సలహాలు అందించారు. భూపాలపల్లి కుగ్రామంగా ఉండగా నాడు మాజీ స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి, నేడు ఎమ్మె ల్యే రమణారెడ్డి అభివృద్ధి బాట పట్టించారు. ఊ హించని విధంగా అభివృద్ధి చేయడంతో పాటు జిల్లా కేంద్రంగా మార్చారు. అభివృద్ధిని ప్రజలు గుర్తించారు. దీనికితోడు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ముఖ్యంగా భూపాలపల్లిపై ప్రత్యేక దృష్టిసారించి రచించిన వ్యూహాలను ఎమ్మెల్యే రమణారెడ్డి అమలు పరిచారు. దీంతో భూపాలపల్లిలో మున్సిపాలిటీని టీ ఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది.logo