ఆదివారం 29 మార్చి 2020
Jayashankar - Jan 24, 2020 , 04:51:38

‘పూరేడుగుట్ట’ పనులు పూర్తిచేయాలి

‘పూరేడుగుట్ట’ పనులు పూర్తిచేయాలిచిట్యాల, జనవరి 23 : వెంచరామి శివారులో నిర్వహించే మినీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సూచించారు. కాల్వపల్లి, వెంచరామి గ్రామస్తుల మధ్య భేదాభిప్రాయాలు లేకుండా, సమన్వయంతో పని చేసి జాతరను విజయవంతం చేయాలని కోరారు. వెంచరామి శివారు పూరేడుగుట్ట వద్ద ఫిబ్రవరి 5నుంచి 8 వరకు జరిగే సమ్మక్క జాతర పనులను ఆయన గురువారం పరిశీలించారు. బైక్ పర్యటిస్తూ పనులను చూశారు. గద్దె వద్ద సమీక్షా సమావేశం నిర్వహించి, మాట్లాడారు. అభివృద్ధి పనుల కోసం ఆర్ నుంచి రూ.7లక్షలు మంజూరైనట్లు తెలిపారు.

వెంటనే నిధులను వినియోగించి జాతరలో పారిశుధ్యం, తాగునీరు, స్నానఘట్టాలకు నీటి సౌకర్యం కల్పించాలని కోరారు. రోడ్లు బాగుండేలా చూడాలని జాతర కమిటీ సభ్యులకు సూచించారు. జాతర అభివృద్ధి పనుల్లో ఇరుగ్రామాల ప్రజలు భాగస్వాములై జాతరను విజవంతం చేయాలని కోరారు. జెడ్పీటీసీ గొర్రె సాగర్, టీఆర్ మండల అధ్యక్షుడు కుంభం రవీందర్ వైస్ ఎంపీపీ నిమ్మగడ్డ రాంబాబు, సర్పంచులు కచ్చు మల్లేశ్, పులి సునీతా అంజిరెడ్డి, పొలవేణ పోషాలు, సిద్ధంకి భాస్కర్, మాసు రాజయ్య, ఎంపీటీసీ పప్పుల విజయలక్ష్మీ సంజీవ్, భుక్య సుజాత రాజు, నాయకులు పిట్ట సురేశ్, ఏరుకొండ గణపతి, చింతల రమేశ్, జెన్నె యుగేందర్, పాండ్రాల స్వామి, పెరుమాండ్ల రవీందర్, పూర్ణచందర్ హరిభూషణ్, కచ్చు శ్రీనివాస్, రవీందర్ రాజేందర్ ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.logo