సోమవారం 06 ఏప్రిల్ 2020
Jayashankar - Jan 24, 2020 , 04:51:38

నేడు ములుగు జిల్లాకు ఇద్దరు మంత్రుల రాక

నేడు ములుగు జిల్లాకు ఇద్దరు మంత్రుల రాక
  • - తాడ్వాయిలో హరిత హోటల్ ప్రారంభించనున్న అమాత్యులు
  • - మేడారంలో అభివృద్ధి పనులపై సమీక్ష


ములుగు జిల్లా ప్రతినిధి/నమస్తేతెలంగాణ: రాష్ట్ర పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ ములుగు జిల్లాలో శుక్రవారం  పర్యటించనున్నారు. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో తాడ్వాయి మండల కేంద్రంలో నిర్మించిన హరిత హోటల్ మంత్రులు ప్రారంభించనున్నారు. అనంతరం మేడారం అభివృద్ధి పనులను పరిశీలించి, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. టీఎన్ ఆధ్వర్యంలో రూపొందించిన 2020 క్యాలండర్, డైరీలను మంత్రులు ఆవిష్కరించనున్నారు. మంత్రులతో పాటు జెడ్పీచైర్మన్ కుసుమ జగదీశ్వర్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.

ముస్తాబైన కాటేజీలు

గోవిందరావుపేట : తాడ్వాయి మండలం కేంద్రంలో టీఎస్ టీడీసీ ఆధ్వర్యంలో నూతన హంగులతో 30 ఏసీ, నాన్ ఏసీ కాటేజీలు నిర్మించారు. టీఎస్ ఎండీ బోయినపల్లి మనోహర్ ప్రత్యేక చొరువతో స్వదేశీ దర్శన్ కింద ద్వారా రూ. 6కోట్ల 80 లక్షల వ్యయంతో నయా జోష్ 30 కాటేజీలతో పాటు, ఏసీ, నాన్ ఏసీ రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. మేడారం వచ్చే భక్తులకు అందుబాటులో ఉంచేందుకు మంత్రులు వీటిని నేడు ప్రారంభించనున్నారు.


logo