సోమవారం 06 ఏప్రిల్ 2020
Jayashankar - Jan 23, 2020 , 02:10:07

ఎన్నికలపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి..

ఎన్నికలపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి..భూపాలపల్లి టౌన్, జనవరి 22 : భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న ఎన్నికలను కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఆర్డీవో వైవీ గణేశ్, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, తహసీల్దార్ శ్రీనివాసచారితో కలిసి ఆయా పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. శాంతినగర్ కాలనీలోని మండల పరిషత్ పాఠశాలలోని పోలింగ్ స్టేషన్, గడ్డిగానిపల్లిలోని మండల పరిషత్ పాఠశాలలోని బూత్, జంగేడులోని జిల్లా పరిషత్ పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలు, కాసింపల్లిలోని మండల పరిషత్ పాఠశాలలోని పోలింగ్ స్టేషన్లను పరిశీలించారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో సిబ్బందిని పోలింగ్ సరళి, ఓటింగ్ శాతాన్ని అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రాల ఆవరణలో వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన తాత్కాలిక మెడికల్ కిట్ మందుల వివరాలను ఆశ వర్కర్లను అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగులు, వృద్ధుల కోసం అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వీల్ పనితీరును కలెక్టర్ పరిశీలించారు. కాసింపల్లిలోని పాఠశాల పోలింగ్ కేంద్రంలో వృద్ధుడిని వీల్ కూర్చోబెట్టి కలెక్టర్ స్వయంగా నెట్టుకుంటూ వెళ్లారు. అధికారులు అప్రమత్తంగా ఉండి ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

వెబ్ ద్వారా పర్యవేక్షణ

మున్సిపల్ ఎన్నికలను కలెక్టర్ వెబ్ ద్వారా పరిశీలించారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మున్సిపల్ కార్యాలయంలో సెంట్రల్ వెబ్ సెంటర్ ఏర్పాటు చేశారు. కలెక్టర్ వెంకటేశ్వర్లుతో పాటు ఆర్ గణేశ్, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య వెబ్ సరళిని పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఓటు వేసే పద్ధతి, పోలింగ్ అధికారుల విధులు , ఆయా పార్టీల అభ్యర్థుల ప్రచారాన్ని పర్యవేక్షించారు.

ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే

 ఎమ్మెల్యే గండ్ర 30వ వార్డులోని 73వ పోలింగ్ స్టేషన్ కుమారుడు గౌతంతో కలిసి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి తనయుడు సిరికొండ ప్రశాంత్ 24వ వార్డులోని 58వ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మా ట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ అయ్యిందని, పో లింగ్ స్టేషన్ వారీగా తాను తిరిగి పోలింగ్ సరళిని పరిశీలించా నని, అన్ని వార్డుల్లో ప్రజలు టీఆర్ అభ్యర్థులకు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. 29 స్థానాల్లో తమ అభ్యర్థులు గెలు స్తారని పేర్కొన్నారు. వెంట 30వ వార్డు అభ్యర్థి మాడ కమల, అర్బన్ అధ్యక్షుడు క్యాతరాజు సాంబమూర్తి, రాంపూర్ సర్పంచ్ తాటి వెంకన్న, టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు మాడ హరీశ్ నాయకులు బామండ్లపల్లి అశోక్ తదితరులు ఉన్నారు.logo