మంగళవారం 31 మార్చి 2020
Jayashankar - Jan 23, 2020 , 02:08:29

పర్యావరణంపై అవగాహన పెంచుకోవాలి

పర్యావరణంపై అవగాహన పెంచుకోవాలిరేగొండ. జనవరి 22 : వనదర్శినిలో భాగంగా నిర్వహిస్తున్న విజ్ఞానయాత్ర విహార యాత్రలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ప్రకృతి, పర్యావరణంపై అవగాహన పెం చుకోవాలని అటవీశాఖ అధికారులు, సిబ్బం ది సూచించారు. తిరుమలగిరి శివారు పాండవుల గుట్టలో అటవీశాఖ, ఓరుగల్లు వరల్డ్ ఆధ్వర్యంలో చేపట్టిన వనదర్శిని విజ్ఞాన విహార యా త్రలో భాగంగా బుధవారం రెం డో రోజు టేకుమట్ల కేజీబీవీ విద్యార్థులు పాల్గొన్నారు. పర్యావరణ విద్య, ‘పర్యావరణ పరిరక్షణలో అడవుల పాత్ర’ తదితర అంశాలను వివరించారు. విజ్ఞాన విహార యాత్రలో  విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నా రు. పాండువుల గుట్టల విశిష్టతను తెలుసుకున్నారు. గుట్టలలో టెక్కింగ్, రాఫెలింగ్ తదితర విన్యాసాలు చేశారు. అనంతరం అటవీ ప్రాంతాన్ని సందర్శించారు. పాండవుల గుట్టలపై ఉన్న రాక్ ఆర్ట్స్, ప్రాచిన కాలపు చిత్రలేఖనం, శిల్పాలులను విద్యార్థులు పరిశీలించారు. వాటి చరిత్రను తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ గుట్టల అందాలు, ఇక్కడి ప్రకృతి చాలా బాగుందని విద్యార్థులు తమ అభిప్రాయాలను వివరించారు. కార్యక్రమంలో ఎఫ్  ప్రసాద్, సిబ్బంది ఫయాజ్, మాధవి, శ్రీకాంత్, రవీందర్ తదితరులు ఉన్నారు.


logo
>>>>>>