ఆదివారం 24 మే 2020
Jayashankar - Jan 21, 2020 , 03:06:24

సమాప్తం..!

 సమాప్తం..!
  • - ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం
  • - మూగబోయిన మైకులు
  • - నిలిచిన ప్రచార రథాలు
  • - చివరి రోజు హోరాహోరీగా..
  • - అన్నీ తామై ప్రచారం చేసిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి దంపతులు
  • - పాల్గొన్న ప్రతినిధులు, నాయకులు
  • -ఆటోలతో భారీ ర్యాలీ
  • - టీఆర్‌ఎస్‌లో చేరిన 25వ వార్డు స్వతంత్ర అభ్యర్థి
  • -పట్టణంలో పోలీసుల కవాతు

జయశంకర్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం ముగిసింది. సోమవారం సాయంత్రం త ర్వాత ఎక్కడా ఎన్నికల ప్రచారం చేయరాదనే నిబంధనతో పారిశ్రామిక ప్రాంతమైన భూపాలపల్లిలో ఒక్కసారిగా మైకులన్నీ మూగబోయాయి. ప్రచార రథాలన్నీ ఎక్కడిక్కడ నిలిచి పోయా యి. ప్రచార ముగింపు సమయం దగ్గ్గర పడుతున్నా కొద్దీ నరాలు చిట్లే ఉత్కంఠ మధ్య చివరి రోజు ఎన్నికల ప్రచారం జరిగింది. బహిరంగ ప్రచారానికి గడువు ముగియడం, పోలింగ్‌కు ఒక్కరోజు సమయం మాత్రమే ఉండడంతో అభ్యర్థుల కుటుం బ సభ్యులు, బంధుమిత్రులు ఇంటింటికీ వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తున్న దృశ్యాలు కనిపించాయి.

చివరి రోజు హోరెత్తిన ప్రచారం

మున్సిపల్‌ ఎన్నికల ప్రచార ఘట్టం సోమవారం సాయంత్రంతో ముగిసింది. చివరి రోజు భూపాలపల్లి పట్టణంలోని అన్ని వార్డుల్లో ప్రచారం హోరెత్తింది. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్‌ రూరల్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి అన్నీ తామై విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. మున్సిపల్‌ పరిధిలోని 30 వార్డుల్లో గండ్ర దంపతు లు వేర్వేరుగా ప్రచారం నిర్వహించారు. ఎనిమిదో వార్డు అభ్యర్థి నూనె రాజు, 27వ వార్డు అభ్యర్థి గండ్ర హరీశ్‌రెడ్డి, 25వ వార్డు అభ్యర్థి గోనె భాస్కర్‌, 18వ వార్డు అభ్యర్థి నాగుల శ్రీలత, 19వ వార్డు అభ్యర్థి గుమ్మడి భాగ్యలక్ష్మితో పాటు పలు వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపును కోరుతూ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వార్డుల్లో ప్రచారం కొనసాగించారు. 16వ వార్డు అ భ్యర్థి బైరెడ్డి లక్ష్మారెడ్డి, 14వ వార్డు అభ్యర్థి దార పూలమ్మ, 17వ వార్డు అభ్యర్థి ముంజంపల్లి మురళీధర్‌, 29వ వార్డు అభ్య ర్థి చల్లూరి మమత, 26వ వార్డు అభ్యర్థి తుమ్మేటి సుచరిత, 4వ వార్డు అభ్యర్థి రేగుల రాకేశ్‌, 2వ వార్డు అభ్యర్థి ఆకుదారి మమతలతో పాటు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని రూరల్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి ప్రచారం నిర్వహించారు.

హోరెత్తిన ఆటో ర్యాలీ

భూపాలపల్లి మున్సిపల్‌ పరిధిలో ఎన్నికల బరిలో నిలిచిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ పట్టణంలోని ఆటో డ్రైవర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. నూతనంగా నిర్మిస్తున్న టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయం సమీపంలో ఆటో ర్యాలీని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రారంభించారు. అక్కడి నుంచి జయశంకర్‌ విగ్రహం వరకు ఎమ్మెల్యే ఆటో నడుపుతూ వచ్చారు. ఆటో ర్యాలీ జయశంకర్‌ చౌక్‌, టీ 2 క్వార్టర్స్‌, కృష్ణకాలనీ, కారల్‌మార్క్స్‌ కాలనీ, గణేశ్‌ చౌక్‌, హనుమాన్‌ నగర్‌, శాంతినగర్‌, ఆకుదారివాడ, సెగ్గంపల్లి, గడ్డిగానిపల్లి, కాసింపల్లి, జంగేడు, వేశాలపల్లి, భాస్కర్‌గడ్డ మీదుగా అంబేద్కర్‌ చౌక్‌కు ర్యాలీ చేరుకుంది. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్‌ గౌరవాధ్యక్షుడు మేకల సంపత్‌యాదవ్‌, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు బుర్ర రమేశ్‌, గ్రంథాలయ చైర్మన్‌ రాజేశ్‌నాయక్‌, కాటారం మాజీ జెడ్పీటీసీ చల్లా నారాయణరెడ్డి, ఆటో యూనియన్‌ జిల్లా కన్వీనర్‌ భీమారం దేవేందర్‌, కాసింపల్లి ఆటో యూనియన్‌ అధ్యక్షుడు దొంగల రమేశ్‌, ఆటో యూనియన్‌ మాజీ అధ్యక్షుడు పోలవేన అశోక్‌, నాయకులు తడుక శ్రీనివాస్‌, నోముల సంపత్‌, బోయిని రజినీకుమార్‌, దయాకర్‌, అంజయ్య, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌లోకి 25వ వార్డు స్వతంత్ర అభ్యర్థి

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 25వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన కూరాకుల రాజయ్య పోటీ నుంచి విరమించుకొని టీఆర్‌ఎస్‌లో చేరారు. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సమక్షంలో రాజయ్య తన అనుచరవర్గం సుమారు 50 మందితో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమణారెడ్డి, రాజయ్య కు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాజయ్య మాట్లాడుతూ.. 25వ వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గోనె భాస్కర్‌ పోటీలో ఉన్నప్పటికీ తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచానన్నారు. టీఆర్‌ఎస్‌ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, భూపాలపల్లిలో ఎమ్మెల్యే రమణారెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గోనె భాస్కర్‌కు మద్దతు ఇవ్వాలని భావించినట్లు తెలిపారు. ఈ మేరకు పోటీ నుంచి తప్పుకొని టీఆర్‌ఎస్‌లో చేరానన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాజయ్యను ఎమ్మెల్యే రమణారెడ్డి అభినందిస్తూ ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు రాజయ్యను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

పోలీసుల కవాతు

మున్సిపల్‌ ఎన్నికలను పురస్కరించుకొని భూపాలపల్లిలో పోలీసులు సోమవారం కవాతు నిర్వహించారు. ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే ప్రజలకు తాము ఉన్నామనే మనోధైర్యం ఉండేలా డీఎస్పీ సంపత్‌రావు ఆధ్వర్యంలో కవాతు కొనసాగించారు.logo