సోమవారం 06 ఏప్రిల్ 2020
Jayashankar - Jan 20, 2020 , 03:21:55

ప్రచారానికి నేటితో తెర

ప్రచారానికి నేటితో తెర
  • - మున్సిపల్‌ ఎన్నికలకు సర్వం సిద్ధం
  • - 72 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు
  • -పోలింగ్‌ అధికారులు, సిబ్బంది నియామకం
  • - ఎనిమిది రూట్లు, నలుగురు జోనల్‌ ఆఫీసర్లు
  • - 30 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తింపు
  • - ఆరు ఫ్లయింగ్‌, ఆరు ఎంసీసీ, 18 ఎస్‌ఎస్‌ టీంల ఏర్పాటు
  • - మున్సిపాలిటీ కార్యాలయాన్నిసందర్శించిన ఏడీఎంఏ


జయశంకర్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మున్సిపల్‌ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. మున్సిపల్‌ నామినేషన్ల పర్వం పూర్తయిన తర్వాత ప్రారంభమైన ప్రచారం వారం రోజులుగా కొనసాగింది. నేడు సాయంత్రం 5 గంటలతో రాజకీయ పార్టీల అభ్యర్థుల ప్రచారం ముగియనుంది. ఈ నెల 22న జరుగనున్న మున్సిపల్‌ ఎన్నికల కోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. 29 వార్డుల పరిధిలో 72 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొ దట 30 వార్డుల్లో 74 కేంద్రాలను ఏర్పాటు చేయాల ని నిర్ణయించారు. తొమ్మిదో వార్డు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తొట్ల సంపత్‌ ఏకగ్రీవం కావడంతో రెండు పోలింగ్‌ కేంద్రాలను రద్దు చేశారు. మొత్తం 29 వార్డుల్లో 72 కేంద్రాల్లో 22న పోలింగ్‌ జరుగనుంది. దీనికి అధికారులు, సిబ్బంది కేటాయింపు పూర్తయింది. బ్యాలెట్‌ పేపర్లను పోలింగ్‌ కేంద్రాల వారీగా సమకూర్చారు. భూపాలపల్లి మున్సిపాలిటీలోని 30 వార్డుల్లో మొత్తం 50,651 మంది ఓటర్లు ఉండగా ఇందులో 26,399 మంది పురుషులు, 24,251 మంది మహిళలు ఉన్నారు. 72 పోలింగ్‌ కేంద్రాలను ఎనిమిది రూ ట్లుగా, నాలుగు జోన్లుగా విభజించారు. ఒక్కో ఓటరుకు ఒక బ్యాలెట్‌ పేపర్‌ చొప్పున, 10శాతం అదనంగా మొత్తం 56,426 బ్యాలెట్‌ పేపర్లను సమకూర్చారు. 50 బ్యాలెట్‌ బాక్సులను సిద్ధం చేశారు. నలుగురు జోనల్‌ అధికారులు, ఎనిమిది మంది రూట్‌ ఆఫీసర్లను నియమించారు. 30 సమసాస్యత్మక పో లింగ్‌ కేంద్రాలను గుర్తించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీసు భద్రతను కట్టుదిట్టం చేశారు. మున్సిపాలిటీలోని ప్రతి ఓటరుకూ పోల్‌ చిట్టీలను పంపిణీ చేయాలనే ఆర్డీవో గణేశ్‌ ఆదేశించగా, బీఎల్‌వోలు, సిబ్బంది ఆ ప్రక్రియను చేపట్టారు. 

72 పోలింగ్‌ కేంద్రాలు

మున్సిపల్‌ పరిధిలోని 29 వార్డుల్లో 72 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రంలో సు మారు 800 మంది ఓటర్లు ఉండేలా చూశారు. 1వ వార్డులో మూడు కేంద్రాలు, 2వ వార్డులో రెండు, 3వ వార్డులో మూడు, 4వ వార్డులో రెండు, 5వ వార్డులో మూడు, 6వ వార్డులో రెండు, 7వ వార్డులో మూడు, 8వ వార్డులో రెండు, 10వ వార్డులో 2, 11వ వార్డులో 3, 12వ వార్డులో 2, 13వ వార్డులో రెండు, 14వ వార్డులో మూడు, 15వ వార్డులో మూడు, 16వ వార్డులో మూడు, 17వ వార్డులో మూడు, 18వ వార్డులో రెండు, 19 లో రెండు, 20వ వార్డులో రెండు, 21లో రెండు, 22లో రెండు, 23లో మూడు, 24లో రెండు, 25వ వార్డులో మూడు, 26లో మూడు, 27లో రెండు, 28వ వార్డులో రెండు, 29లో వార్డులో మూడు, 30వ వార్డులో రెండు కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఎనిమిది రూట్ల ఏర్పాటు

ఎన్నికల్లో భాగంగా 72 పోలింగ్‌ కేంద్రాలను 30 రూట్లుగా విభజించారు. ఎనిమిది రూట్లల్లో నలుగురు జోనల్‌ అధికారులను నియమించారు. 1వ రూట్‌లో తొమ్మిది పోలింగ్‌ కేంద్రాలు, 2వ రూట్‌లో తొమ్మిది, 3వ రూట్‌లో ఎనిమిది, 4వ రూట్‌లో పది, 5వ రూట్‌లో 12, 6వ రూట్‌లో తొమ్మిది, 7వ రూట్‌లో 13, 8వ రూట్‌లో నాలుగు పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ రూట్లలో నలుగురు జోనల్‌ అధికారులతో పాటు ఇద్దరిని రిజర్వ్‌గా, ఎనిమిది మంది రూట్‌ ఆఫీసర్లకు పలువురిని రిజర్వ్‌గా ఉంచారు.

ఏర్పాట్లను పరిశీలించిన ఏడీఎంఏ

భూపాలపల్లి మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లను ఏడీఎంఏ (అడిషనల్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌) అనురాధ ఆదివారం పరిశీలించారు. మున్సిపాలిటీ కార్యాలయానికి చేరుకొని కమిషనర్‌ సమ్మయ్య, టీపీవో గిరిధర్‌తో సమావేశమై ఏర్పాట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఓటర్ల జాబితా, పోలింగ్‌ స్టేషన్ల జాబితా, పోలింగ్‌ అధికారుల వివరాలు, కౌంటింగ్‌ కేంద్రంలో ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో సౌకర్యాల కల్పనపై ఆరా తీశారు. ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఎన్నికల అధికారుల నియామకం

పోలింగ్‌కు సంబంధించి 72 పోలింగ్‌ కేంద్రాలకు పోలింగ్‌ అధికారులను నియమించారు. 76 మంది ప్రెసిడింగ్‌ అధికారులతో పాటు 16 మంది అధికారులను రిజర్వ్‌ చేశారు. 76 మంది అసిస్టెంట్‌ ప్రెసిడింగ్‌ అధికారులతో పాటు 14 మంది అ ధికారులను రిజర్వ్‌ చేశారు. ఒక ప్రెసిడింగ్‌ అధికారి పరిధిలో ముగ్గురు పోలింగ్‌ అధికారులను నియమించడంతో పాటు 14 మంది అధికారులను రిజర్వ్‌ చేశారు. 33 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించా రు. వీరితో పాటు ఆరు ఫ్లయింగ్‌ స్కాడ్‌ టీంలు, ఆరు ఎంసీసీ (మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌) టీంలు, 18 ఎస్‌ఎస్‌ (స్టాటికల్‌ స ర్వేలెన్స్‌) టీంలను ఏర్పాటు చేశారు. భూ పాలపల్లిలోని హనుమాన్‌ దేవాలయం వద్ద, చెల్పూర్‌ సమీపంలోని కుందూరుపల్లి వద్ద చెక్‌ పోస్టులను ఏర్పాటు చేశారు.logo