గురువారం 09 ఏప్రిల్ 2020
Jayashankar - Jan 19, 2020 , 01:33:21

వైద్య విద్యార్థి దారుణ హత్య

 వైద్య విద్యార్థి దారుణ హత్య


రేగొండ, జనవరి 18 : ఎంబీబీఎస్‌ మూడో సం వత్సరం చదువుతున్న తుమ్మనపెల్లి వంశీ (24) దా రుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు వంశీని హత్య చేసి ఆపై కాళ్లు, చేతులు తాళ్లతో కట్టేసి వ్యవసాయ బావిలో పడేశారు. సెలవుల అనంతరం కాలేజీకి వెళ్లిన వంశీ మరుసటి రోజే స్వగ్రామంలోని వారి వ్యవసాయ బావిలో శవమై కన్పించడంతో ప లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ హత్య చేసింది ఎవరు? ఎందుకు చేశారు? హత్య వెనుక కారణాలు ఏమిటి? కాలేజీలో ఏమైనా గొడవలు ఉ న్నాయా? అనే సందేహలు కుటుంబ సభ్యులు, గ్రా మస్తుల్లో వ్యక్తం అవుతున్నాయి. కాగా, వంశీది హ త్య, ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఉన్నత చదువులు చదివి పేద ప్రజలకు సేవ చేస్తాడనుకున్న కొడుకు హత్యకు గురి కావడం తో తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు పలువురిని కం టతడి పెట్టించింది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వివరాల ప్రకారం..  రేగొండ మండలం కనిపర్తికి చెందిన తుమ్మనపెల్లి తిరుపతి రమ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు.

చిన్నకొడుకు వంశీ ఖమ్మం జిల్లా కేంద్రంలోని మమత మె డికల్‌ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్నా డు. సంక్రాంతి పండుగ సెలవులు కావడంతో వంశీ ఇంటికి వచ్చాడు. శుక్రవారం తిరిగి కాలేజీకి వెళ్లాడని, రాత్రి 8గంటలకు తండ్రి తిరుపతి వంశీకి  ఫో న్‌ చేయగా ఖమ్మంలో ఉన్నానని తెలిపాడన్నారు. శనివారం ఉదయం 11 గంటలకు పొలానికి నీరు పెట్టడానికి తిరుపతి వెళ్లగా వ్యవసాయ బావి సమీపంలో చెప్పులు, బ్యాగ్‌, సెల్‌ఫోన్‌ కన్పించగా అవి తన కొడుకువిగా గుర్తించి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వచ్చి బావిలో వెతకగా వంశీ శవమై కన్పించడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. వంశీని గుర్తు తెలియని వ్యక్తులు వంశీని హత్య చేసి ఆపై తాళ్లతో చేతులు, కాళ్లు కట్టేసి శక్రవారం రాత్రి బావిలో పడేసినట్లు తెలుస్తుంది. చేతులను కరంట్‌ సర్వీస్‌ వైర్లు, కాళ్లును చీర పీలికలతో కట్టేశారు. వం శీని ఇంత దారుణంగా ఎవరు ఎందుకు చంపారన్నది గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. కా గా, కాలేజీకి వెళ్లిన కొడుకు మరునాడే శవమై కన్పించడంతో తల్లిదండ్రుల దుఃఖం కట్టలు తెంచుకుంది. డాక్టర్‌ అయి పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తావనుకున్న కొడుకా అంటూ తల్లిదండ్రులు మృతదేహంపై పడి బోరున విలపించారు. మనం ఎవరికి ఏ పాపం చేశాం.. నిన్ను ఇంత దారుణంగా ఎందు కు చంపారు అంటూ వారు విలపిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. చేతికి ఆందిన కొడుకు హత్యకు గురి కావడంతో కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక పోతున్నారు. వంశీ మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది.

కాగా, వంశీది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గుర్రుం కృష్ణప్రసాద్‌గౌడ్‌ తెలిపారు. ఘటనా స్థలాన్ని భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు, చిట్యాల సీఐ సాయిరమణలు సందర్శించి కుటుంబ సభ్యులు, గ్రామస్తులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, శుక్రవారం కాలేజీకి వెళ్తున్నానని చెప్పి బయలుదేరిన వంశీ కళాశాలకు వెళ్లాడా? కాలేజీకి వెళ్లకపోతే పొ ద్దంతా ఎక్కడ ఉన్నాడు? అతడిని ఎవరైనా కిడ్నాప్‌ చేసి హత్య చేశారా? ఒకవేళ ఎవరైనా వంశీని హత్య చేస్తే అతడి స్వగ్రామంలోని సొంత వ్యవసాయ బావిలోనే శవాన్ని ఎందుకు పడేశారు? కాలేజీలో ఏదైనా సమస్య ఉందా? లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనే వివరాలు తెలియాల్సి ఉంది.logo