సోమవారం 06 ఏప్రిల్ 2020
Jayashankar - Jan 19, 2020 , 01:32:16

వెదురు స్టాల్స్‌ను సద్వినియోగం చేసుకోవాలి

వెదురు స్టాల్స్‌ను సద్వినియోగం చేసుకోవాలి


తాడ్వాయి, జనవరి18 : మేడారం జాతర పరిసరాల్లో ఏర్పాటు చేసిన వెదురు స్టాల్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని పీసీసీఎఫ్‌ (ప్రిన్సిపల్‌ సెక్రటరీ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్టు) శోభ అన్నారు. శనివారం మేడారం సమ్మక్క-సారక్కలను దర్శించుకున్న అనంతరం జాతర పరిసరాల్లో అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వెదు రు స్టాల్స్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అడవుల ను రక్షించేందుకు అటవీశాఖ ఆధ్వర్యంలో ఎన్నో చర్యలు చేడుతున్నామని తెలిపారు. లక్షలాది రూపాయలు వెచ్చించి అడవుల ను పెంచేందుకు మొక్కలు నాటుతున్నామ ని అన్నారు. మేడారం మహాజాతరలో భాగంగా జాతర పరిసరాల్లో వ్యా పారాలు నిర్వహించేందుకు వ్యాపారులు గుడిసెలను ఏర్పాటు చేసుకుంటారని, వారికి ఇ బ్బందులు కలుగకుండా వెదురు స్టాల్స్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. అడవులను నరకకుండా స్టాల్స్‌లో విక్రయించే  వెదురు కర్రలను కొనుగోలు చే యాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జాతర పరిసరాల్లోని అడవులను కొందరు అక్రమంగా నరికివేస్తున్నారని, వారు తమ పద్ధతి మార్చుకుని స్టాల్స్‌ను వినియోగించుకోవాలని అన్నారు. ఊరట్టం స్తూపం వద్ద, ఆర్టీసీ బస్టాండ్‌, చిలుకలగుట్ట తదితర ప్రాంతాల్లో ఈ స్టాల్స్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. అనంతరం చింతల్‌క్రాస్‌లోని ప్లాంటేషన్‌ను ఆమె పరిశీలించారు. అక్కడ మొక్కలు నాటారు. నాటిన మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఆమె వెంట అడిషినల్‌ పీసీసీఎఫ్‌ ఎంజే అక్బర్‌, ఎఫ్‌డీవోలు, రేంజ్‌ అధికారులు ఉన్నారు.logo