శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Jayashankar - Jan 19, 2020 , 01:30:48

కారుగుర్తుకు ఓటు.. అభివృద్ధికి చోటు

కారుగుర్తుకు ఓటు.. అభివృద్ధికి చోటు


భూపాలపల్లి టౌన్‌, జనవరి 18: ము న్సిపల్‌ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి అభివృద్ధికి పట్టం కట్టాలని టీఆర్‌ఎస్‌ యూత్‌ నాయకులు కోరారు. కాశీంపల్లికి చెందిన టీఆర్‌ఎస్‌ యూత్‌ అధ్యక్షుడు పోలవేన మహేందర్‌ ఆధ్వర్యంలో భూపాలపల్లిలో యువకులు కేటీఆర్‌ మాస్కులు వేసుకొని శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీబీజీకేఎస్‌ కార్యాలయం నుంచి అంబేద్కర్‌ చౌక్‌, గణేశ్‌ చౌక్‌, జయశంకర్‌ చౌక్‌ వరకు ర్యాలీ కొనసాగించారు. ‘కారు గుర్తుకు ఓటేద్దాం.. అభివృద్ధికి చోటిద్దాం. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపిద్దాం.. భూ పా లపల్లిని మరింత అభివృద్ధి చేసుకుం దాం’ అని నినాదాలు చేశారు. ఇందులో సామల హరీశ్‌, కొమురవెల్లి రా కేశ్‌, కట్ట రాకేశ్‌, కరాటే దిలీప్‌, సోమారపు రవితేజ, మేకల రాజ్‌కుమార్‌, గంట రమేశ్‌, అప్రోజ్‌, మేకల రాజేందర్‌ సుమారు వంద మంది పాల్గొన్నారు.


logo