ఆదివారం 29 మార్చి 2020
Jayashankar - Jan 18, 2020 , 03:05:42

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించండి

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించండి
  • - ప్రజలకు ప్రతిపక్షాలపై నమ్మకం లేదు
  • - ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
  • - 20, 21వ వార్డుల్లో విస్తృత ప్రచారం

భూపాలపల్లి టౌన్‌/కలెక్టరేట్‌, జనవరి 17 : టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించి భూపాలపల్లి మున్సిపాలిటీలో గులాబీ జెండాను ఎగురవేయాలని ఎమ్మెల్యే గం డ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవారం సాయం త్రం మున్సిపాలిటీ పరిధిలోని 20, 21వ వార్డుల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు చల్లా రేణుక రాములు, జక్కం రవికుమార్‌ తరుపున ఎమ్మెల్యే గండ్ర ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ నెల 22వ తేదీన జరిగే మున్సిపాలిటీ ఎన్నికల్లో 20, 21వ వార్డుల నుంచి టీఆర్‌ఎస్‌ తరుపున పోటీ చేస్తున్న అభ్యర్థులు చల్లా రేణుక రాములు, జక్కం రవికుమార్‌ను అధిక మెజార్టీతో గెలిపించి గులాబీ జెండాను ఎగురవేయాలన్నారు. ఓపెన్‌కాస్ట్‌ పరిసర ప్రాంతంలో ఉన్న 20వ వార్డులో ఏడాదికి రెండుసార్లు హెల్త్‌ క్యాంపులు నిర్వహించి ప్రజల ఆరోగ్య సమస్యలను తీరుస్తానని, కాలనీ ప్రజల చిరకాల వాంఛ అయిన ఇండ్ల పట్టాలను ఎన్నికల తర్వాత ఇప్పిస్తానన్నారు.

అలాగే కాలనీలోని డ్రైనేజీ సమస్యలు పరిష్కరించి మెరుగైన సౌకర్యాలను కల్పించి ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం ఉండేలా కృషి చేస్తానన్నారు. పని చేసే పార్టీకి మాత్రమే ఓటు వేయాలని, అభివృద్ధిని కాంక్షించే ప్రజలు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. ప్రతిపక్ష నాయకులు ఉత్తర ప్రగల్బాలు పలికి ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, వారి మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. కాలనీ ప్రజల అవసరాలు తెలిసిన వ్యక్తులు చల్లా రేణుక, జక్కం రవికుమార్‌ అని, గత మున్సిపల్‌ ఎన్నికల్లో మాదిరి కాకుండా ఈసారి ప్రజలు ఆదరించి గెలిపిస్తే వార్డు అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు మరింత చేరువ కావాలంటే టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో మహిళా ఆర్గనైజర్‌ భారతీరెడ్డి, టీఆర్‌ఎస్‌ అర్బన్‌ అధ్యక్షుడు క్యాతరాజు సాంబమూర్తి, నాయకులు శేషాల స్వాతి వెంకన్న, బుర్ర సదానందం, సదానందం, గడ్డం రాజు, ఆర్‌ రమేశ్‌, రడపాక రమేశ్‌, విజయ్‌, శారద, ర మేశ్‌కుమార్‌, సదానందం తదితరులు పాల్గొన్నారు.logo