ఆదివారం 29 మార్చి 2020
Jayashankar - Jan 17, 2020 , 01:54:03

టీఆర్ అభ్యర్థికి మద్దతుగా..

టీఆర్ అభ్యర్థికి మద్దతుగా..


భూపాలపల్లి టౌన్, జనవరి 16 : భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డు నుం చి పోటీ చేస్తున్న టీఆర్ అభ్యర్థి ఆకుదారి మ మతకు ప్రధాన పోటీగా ఉన్న స్వతంత్ర అభ్యర్థి అరికిళ్ల వరలక్ష్మి సురేందర్ మద్దతు ప్రకటించా రు. టీఆర్ పార్టీకి చెందిన ఆకుదారి మమత, అరికిళ్ల వరలక్ష్మి సురేందర్ రెండో వార్డు నుం చి బరిలోకి దిగారు. ఈ క్రమంలో ఆకుదారి మమతకు టీఆర్ పార్టీ బీ ఫారం అందించిం ది. కాగా, బరిలో ఉన్న వరలక్ష్మిసురేందర్ నామినేషన్ ఉపసంహరించుకోలేదు. ఈ వార్డులో ఇద్దరి మధ్యనే ప్రధానంగా పోటీ నెలకొనడంతో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వరలక్ష్మి సురేందర్ పిలిచి మాట్లాడారు. భవిష్యత్ అవకాశం ఉంటుందని, మమతకు మద్దతు ప్రకటించాలని కోరారు. దీంతో వరలక్ష్మిసురేందర్ పోటీ నుంచి విరమించుకొని మమతకు మద్దతు ఇవ్వడానికి అంగీకరించారు. మమత గెలుపునకు కృషి చేస్తానని వరలక్ష్మి సురేందర్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారిరువురితో కలిసి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రచారానికి వెళ్లారు.


logo