మంగళవారం 31 మార్చి 2020
Jayashankar - Jan 14, 2020 , 03:01:29

రెండో విడతలో 12 మంది

రెండో విడతలో 12 మంది
  • - అభ్యర్థుల జాబితా విడుదల చేసిన టీఆర్‌ఎస్‌

భూపాలపల్లి టౌన్‌, జనవరి 13 : మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేయబోయే టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల రెండో జాబితాను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఎన్నికల పరిశీలకులు, మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ ప్రకాశ్‌రావు, ఎన్నికల ఇన్‌చార్జి గోవింద్‌నాయక్‌, వరంగల్‌ రూరల్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి సోమవారం విడుదల చేశారు. మొదటి విడత శుక్రవారం తొమ్మిది మంది జాబితా విడుదల చేయగా శనివారం మరో 12 మంది జాబితాను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారికి కండువాలు కప్పి అభినందించారు. అనంతరం రమణారెడ్డి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి పోటీలో ఉన్నవారంతా సమర్థులేనని, ఎంపిక చేయడానికి చాలా కసరత్తు చేశామని తెలిపారు. అవకాశం రాని వారు బాధతో ఉన్నప్పటికీ టికెట్‌ వచ్చిన అభ్యర్థులతో కలిసి పని చేయాలని, వారిని పార్టీ కంటికి రెప్పలా చూసుకుంటుందన్నారు. ఎవరూ నిరాశ పడవద్దని, సముచిత స్థానం త్వరలోనే లభిస్తుందన్నారు. ఇంకా అనేక ఎన్నికలున్నాయని, అవకాశాలుంటాయని, పెద్ద మనస్సుతో అర్థం చేసుకొని కలిసి పని చేయాలని కోరారు. అనంతరం ఎన్నికల పరిశీలకులు గుండా ప్రకాశ్‌ మాట్లాడుతూ.. బరిలో ఉన్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థులందరినీ ఒప్పించి, మెప్పించి ఎంపిక చేశామని, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి రెండ్రోజులుగా అలుపెరుగకుండా శ్రమించి, ఆలోచించి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. మిగిలిన జాబితా రేపు విడుదల చేస్తామని వెల్లడించారు. సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరిగిందని తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా అందరూ ఇళ్ల ముందు కారు గుర్తు ముగ్గులు వేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ అర్బన్‌ అధ్యక్షుడు క్యాతరాజు సాంబమూర్తి, నాయకులు బుర్ర రమేశ్‌, మందల విద్యాసాగర్‌రెడ్డి, మందల రవీందర్‌రెడ్డి, కల్లెపు రఘుపతిరావు తదితరులు పాల్గొన్నారు.

వార్డు               ప్రకటించిన అభ్యర్థి పేరు
9వ                       తొట్ల సంపత్‌
10వ                         బద్ది సమ్మయ్య
11వ                         అజ్మీరా రాధ
12వ                         కొత్త హరిబాబు
13వ                         మంగళపల్లి తిరుపతి
14వ                         దార పూలమ్మ
15వ                          నాగవెల్లి సరళ
16వ                          బైరెడ్డి లక్ష్మారెడ్డి
17వ                     ముంజంపల్లి మురళీధర్‌
27వ                          గండ్ర హరీశ్‌రెడ్డి
28వ                          పెద్దిరెడ్డి దేవేందర్‌
30వ                          మాడ కమల


37 నామినేషన్ల ఉపసంహరణ

భూపాలపల్లి మున్సిపల్‌ ఎన్నికల్లో సోమవారం 37 నామినేషన్లను అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డుల్లో 326 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో బీజేపీ 46, సీపీఐ 9, సీపీఎం 2, కాంగ్రెస్‌ 40, టీఆర్‌ఎస్‌ 138, ఏఐఎప్‌బీ 37, స్వతంత్ర అభ్యర్థుల నుంచి 37 నామినేషన్లు దాఖలైన విషయం తెలిసిందే. కాగా, సోమవారం 37 నామినేషన్లను అభ్యర్థులు విత్‌డ్రా చేసుకున్నారు. ఇందులో టీఆర్‌ఎస్‌ 22, కాంగ్రెస్‌ 1, బీజేపీ 3, ఏఐఎప్‌బీ 1, స్వతంత్ర 9, సీపీఎం 1 నామినేషన్లు ఉన్నాయి.logo
>>>>>>