శనివారం 04 ఏప్రిల్ 2020
Jayashankar - Jan 14, 2020 , 02:58:29

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలి

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలి
  • - మరింత అభివృద్ధి చేస్తాం
  • - ప్రతిపక్షాలకు కార్యకర్తలు లేరు
  • -రాష్ట్రంలోనే టీఆర్‌ఎస్‌ బలమైన పార్టీ
  • - కూటములెన్నైనా టీఆర్‌ఎస్‌దే విజయం
  • -రూరల్‌ జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి

కృష్ణకాలనీ, జనవరి 13 : ఈ నెల 22న జరిగే భూపాలపల్లి మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఆశీర్వదించి గెలిపించాలని వరంగల్‌ రూరల్‌ జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి కోరారు. భూపాలపల్లి మున్సిపల్‌ పరిధిలోని 5, 6వ వార్డుల్లోని యాదవకాలనీ, కృష్ణకాలనీల్లో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 5వ వార్డు యాదవ కాలనీలో అభ్యర్థి సింగనవేన విజేత, 6వ వార్డు కృష్ణకాలనీలో అభ్యర్థి ఎడ్ల మౌనికతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి మాట్లాడుతూ.. రాబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని, భూపాలపల్లి మున్సిపాలిటీ మరింత అభివృద్ధి చెందేలా చూస్తామన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ బలమైన పార్టీ అని, అధికారంలో ఉందని, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, తాను కలిసి సీఎం కేసీఆర్‌తో మాట్లాడి అధిక నిధులు తీసుకొచ్చి భూపాలపల్లి మున్సిపాలిటీని సుందరవనంగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రతిపక్షాలు తమ ప్రచారంలో తాము గెలుస్తామని ఏవేవో పగటి కలలు కంటున్నాయని, భూపాలపల్లి మున్సిపాలిటీలో 30 వార్డుల్లో ఎక్కడా ప్రతిపక్షాలకు కార్యకర్తలు లేరన్నారు. ఎన్ని కూటములు వచ్చినా టీఆర్‌ఎస్‌కు పోటీ ఉండదని, భూపాలపల్లిలో వెలిసిన కూటములు రాజకీయ బలం లేనివని ఎద్దేవా చూశారు. భూపాలపల్లి మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే ఘనవిజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. భూపాలపల్లి గతంలో చెందిన అభివృద్ధి కంటే ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సీఎం కేసీఆర్‌ సహకారంతో మరిన్ని నిధులు తీసుకొచ్చి పట్టణంలోని ప్రతి వాడవాడనా రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సౌకర్యాలు కల్పించి సమస్యలను తీరుస్తామన్నారు.

టీఆర్‌ఎస్‌ పేదల సంక్షేమ పార్టీ అని, సీఎం కేసీఆర్‌ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందారన్నారు. 5, 6 వార్డుల అభ్యర్థులు స్థానికులని, వీరిని గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించడంలో భాగస్వాములు అవుతారన్నారు. సింగనవేన విజేత చిరంజీవి, ఎడ్ల మౌనిక శ్రీనివాస్‌ గత పది సంవత్సరాలుగా యాదవ కాలనీ, కృష్ణకాలనీ ప్రజల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తారని చెప్పారు. కార్యక్రమంలో 5, 6వ వార్డుల ఇన్‌చార్జిలు చిట్యాల జెడ్పీటీసీ గొర్రె సాగర్‌, చిట్యాల ఎంపీపీ దావు వీరారెడ్డి, శాయంపేట ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు కూచన నరేశ్‌, అల్లి సురేష్‌, కప్పల శ్యామ్‌, ఉమేశ్‌, శ్రీనివాస్‌, కామిడి దేవేందర్‌, సంధ్య, ఉమ, కవిత, రాము, మహేశ్‌, నాగరాజు, సురేందర్‌రెడ్డి, సీలం సదిరాజ్‌, అప్పం రమేశ్‌, రాము, కొండబోయిన శ్రీనివాస్‌, కమల్‌, మాదాసి ఉమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.


logo