మంగళవారం 31 మార్చి 2020
Jayashankar - Jan 13, 2020 , 02:52:24

స్వామి వివేకానందుడిని స్ఫూర్తిగా తీసుకోవాలి

స్వామి వివేకానందుడిని స్ఫూర్తిగా తీసుకోవాలి- జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు
కలెక్టరేట్‌, జనవరి12: స్వామి వివేకానందను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు సూచించారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఆదివారం సింగరేణి ఇల్లందు క్లబ్‌హౌస్‌లోజిల్లా యువజన క్రీడలశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అథితిగా  హాజరయ్యారు. అనంతరం స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ భారతదేశ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు తెలిపి, యువత తలుచుకుంటే సాధించలేనిది ఏమిలేదని చాటిచెప్పిన గొప్పవ్యక్తి స్వామి వివేకానంద అని అన్నారు. నేటి యువత స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకొని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఆడవారిని పూజించే దేశం మనది, మన సంప్రదాయాలు చాలాగొప్పవి అన్నారు. అలాంటి సంప్రదాయాలను నేటి యువత మర్చి పోవడం వల్ల స మాజంలోని ఆడవారిపై వేధింపులు ఎక్కువ అవుతున్నాయని చెప్పారు. ప్రతి ఒక్కరు సమాజంలోని స్త్రీల  గౌరవించాలని సూచించారు. తల్లిదండ్రుల ను, విద్యనేర్పిన గురువులను ఎప్పటికి మర్చిపోరాదని పేర్కొన్నారు. యువత సాధ్యమైనంత వరకు జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండి, సంప్రదాయ ఆహారాన్ని తీసుకొని ఆరోగ్య వంతమైన యు వ సమాజ స్థాపనకు కృషి చేయాలని కోరారు. మారుమూల ప్రాంతాలను  కలిగిన మన జిల్లా నుంచి జాతీయ స్థాయిలో మన విద్యార్థులు ర్యాంకులు తెచ్చుకొని ఆదర్శంగా నిలుస్తున్నారని, వారిని ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. తానుకూడా కష్టపడి ఈ స్థానానికి చేరుకున్నానని, విజయం ఒక్క రోజులో రాదని, విజ యం సాధించే వరకు ప్రయత్నం ఆపొద్దని అన్నా రు. ఈ సందర్భంగా క్రీడల్లో గెలుపొందిన యువకులకు బహుమతులను, జ్ఞాపికలను అందించా రు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల, అటవీ శాఖాధికారి పురుషోత్తం, డీపీవో చంద్రమౌళి, సబ్‌రిజిస్ట్రార్‌ తస్లీమా, యువత పాల్గొన్నారు.


logo
>>>>>>