శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Jayashankar - Jan 13, 2020 , 02:50:23

‘స్నేహ సంబంధాలు పెంపొందించుకోవాలి’

‘స్నేహ సంబంధాలు పెంపొందించుకోవాలి’


స్టేషన్‌ఘన్‌ఫూర్‌ నమస్తే తెలంగాణ: క్రీడలతో యువత స్నేహ సంబంధాలు పెంపొందించుకోవాలని మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్‌ పుటం పురుషోత్తంరావు అన్నారు. సంక్రాంతిని పురస్కరించుకుని చాగల్లులో స్వాగత్‌ యూత్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు రెండో రోజు ఆదివారం కొనసాగాయి. ఈ సందర్భంగా జనగామ, నల్లగొండ, రంగారెడ్డి, వరంగల్‌ అర్బన్‌, మహబూబ్‌బాద్‌, తొర్రూరు తదితర ప్రాంతాల నుంచి దాదాపు 50 జట్లు పాల్గొన్నాయి. ముఖ్య అతిథులుగా పురుషోత్తంరావుతోపాటు జనరల్‌ సెక్రటరీ మంగళారపు లక్ష్మణ్‌, సీఐ రాజిరెడ్డి, స్టేషన్‌ఘన్‌ఫూర్‌ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ చింతకుంట్ల నరేందర్‌రెడ్డి, వీఆర్వో ప్రవీణ్‌రెడ్డి(ఓయూ మాజీ వాలీబాల్‌ క్రీడాకారుడు) హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం సర్పంచ్‌ పోగుల సారంగపాణి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో పురుషోత్తంరావు మాట్లాడుతూ దేశం తరఫున ఆడిన, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. గతంలో క్రికెట్‌కు క్రేజీ ఉండేదని, ప్రస్తుతం కబడ్డీకి కూడా ప్రాధాన్యం పెరిగిందన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడలపై దృష్టి పెట్టాలన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ సీఐ రాజిరెడ్డి మాట్లాడుతూ క్రీడలతోనే మానసికోల్లాసం కలుగుతుందని తెలిపారు. క్రీడల్లో చురుగ్గా పాల్గొని తమలోని నైపుణ్యాన్ని చాటుకోవాలని సూచించారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులకు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని పలువురిని ఉదహరించారు. అనంతరం గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్న యూత్‌ సభ్యులను సీఐ అభినందించారు. అనంతరం పురుషోత్తంరావును స్థానిక మున్నూరుకాపు సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు.

క్రీడాకారులకు భోజన సౌకర్యం

కబడ్డీ పోటీలు మూడు రోజులపాటు జరగనుండగా, క్రీడాకారులకు చాగల్లు ఉపసర్పంచ్‌ పొన్నబోయిన రవి తన తండ్రి బుచ్చయ్య జ్థాపకార్థం భోజన సౌకర్యం కల్పించారు. మున్నూరుకాపు సంఘం అధ్యక్షుడు సంపత్‌, సభ్యుడు జాబు అనిల్‌ క్రీడాకారులకు కోడిగుడ్లు అం దించారు. కార్యక్రమంలో జిల్లా అసోసియేషన్‌ బాధ్యు లు తోటకూరి గట్టయ్య, ఎల్‌ సత్యనారాయణ, నీలం కుమార్‌, నరేందర్‌, టీ వెంకటేశ్వర్లు, సీహెచ్‌ సుధాకర్‌, ఉపసర్పంచ్‌ రవి, టీఆర్‌ఎస్‌ గ్రామ అధ్యక్షుడు ఏ కుమార్‌, యూత్‌ అధ్యక్షుడు కూన రాజు, ఉపాధ్యక్షుడు సొన్నాయిల సురేశ్‌, కార్యదర్శి అన్నెపు అనిల్‌, కూన రమేశ్‌, క్రీడా కార్యదర్శి వేళ్ల శ్రీకాంత్‌, సభ్యులు రంగు యాకయ్య, సౌదరపల్లి సంపత్‌రాజు, దోమల రమేశ్‌, కత్తెరశాల వెంకటేశ్‌, గూడూరు పూర్ణచందర్‌, శ్రీను, తోట రమేశ్‌, గూడెల్లి రాజేశ్‌ పాల్గొన్నారు.


logo