శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Jayashankar - Jan 12, 2020 , 04:38:11

నామినేషన్ల పరిశీలన పూర్తి

నామినేషన్ల పరిశీలన పూర్తి
  • -అన్ని నామినేషన్లు ఆమోదం
  • -30 వార్డుల్లో 326 నామినేషన్లు
  • -పర్యవేక్షించిన కలెక్టర్‌ వెంకటేశ్వర్లు

భూపాలపల్లి టౌన్‌, జనవరి 11 : భూపాలపల్లి మున్సిపాలిటీలో శుక్రవారం నామినేషన్ల పర్వం పూర్తి కాగా శనివా రం పరిశీలన జరిగింది. మున్సిపాలిటీ కార్యాలయంలో ఆ యా వార్డులకు సంబంధించి ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసి అభ్యర్థుల సమక్షంలో నామినేషన్లు పరిశీలించారు. 30 వార్డుల నుంచి మొత్తం 326 నామినేషన్లు దాఖలయ్యాయి. అధికారులు ఒక్కో నామినేషన్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇందులో ఒక్క నామినేషన్‌ కూడా తిరస్కరణకు గురి కాలేదు. 1వ వార్డులో 13, 2వ వార్డులో 8, 3వ వార్డులో 6, 4వ వార్డులో 13, 5వ వార్డులో 7, 6వ వార్డులో 9, 7వ వార్డులో 12, 8వ వార్డులో 14, 9వ వార్డులో 12, 10వ వార్డులో 7, 11వ వార్డులో 9, 12వ వార్డులో 11, 13వ వార్డులో 14, 14వ వార్డులో 11, 15వ వార్డులో 13, 16వ వార్డులో 14, 17వ వార్డులో 14, 17వ వార్డులో 9, 18వ వార్డులో 9, 19వ వార్డులో 9, 20వ వార్డులో 11, 21వ వార్డులో 8, 22వ వార్డులో 8, 23వ వార్డులో 11, 24వ వార్డులో 9, 25వ వార్డులో 16, 26వ వార్డులో 7, 27వ వార్డులో 14, 28వ వార్డులో 7, 29వ వార్డులో 21, 30వ వార్డులో 9 నామినేషన్లకు అధికారులు ఆమోదం తెలిపారు. కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు స్క్రూటీని కార్యక్రమాన్ని పరిశీలించారు. ఆర్డీవో గణేశ్‌, కమిషనర్‌ సమ్మయ్యతో పాటు అధికారులు స్క్రూటీని జరిపారు. ఈ సందర్భంగా అభ్యర్థులతో మున్సిపల్‌ కార్యాలయం కిటకిటలాడింది.logo