సోమవారం 30 మార్చి 2020
Jayashankar - Jan 12, 2020 , 04:37:20

పలువురు అధికారులకు డెమోక్రసీ అవార్డులు

పలువురు అధికారులకు డెమోక్రసీ అవార్డులు
  • -అందజేసిన గవర్నర్‌ తమిళి సై సౌందర్‌రాజన్‌

ములుగు, నమస్తే తెలంగాణ/జయశంకర్‌ భూపాలపల్లి కలెక్టరేట్‌, జనవరి 11  : ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో గత సంవత్సరం పంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించినందుకుగాను రెండు జిల్లాలకు చెందిన పలువురు అధికారులకు తెలంగాణ స్టేట్‌ డెమోక్రసీ అవార్డులు దక్కాయి. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లోని తారమతి భారమతిలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ తమిళి సై సౌందర్‌రాజన్‌, రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌,  డీజీపీ మహేందర్‌రెడ్డి చేతుల మీదుగా ఈ అవార్డులను శనివారం అందుకున్నారు. ములుగు జిల్లాలోని పస్రా పోలీస్‌ స్టేషన్‌లో సీఐగా విధులు నిర్వర్తిస్తున్న అనుముల శ్రీనివాస్‌, ములుగు ఎంపీడీవో భూక్య రవి, గోవిందరావుపేట గత ఎంపీడీవో జే ప్రవీణ్‌కుమార్‌, వాజేడు ఎంపీడీవో కే చంద్రశేఖర్‌, వెంకటాపురం(నూగూరు) మండల పంచాయతీ అధికారి ఏ ఫణిచంద్రతోపాటు అప్పటి ములుగు డీసీవో ఆర్‌ కరుణాసాగర్‌లు ఈ అవార్డును అందుకున్నారు. అలాగే  జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా నుంచి జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, జిల్లా అదనపు ఎస్పీ రాజమహేంద్రనాయక్‌, భూపాలపల్లి ఎంపీడీవో అనీల్‌కుమార్‌, మల్హర్‌ ఎంపీడీవో నర్సింహమూర్తి, జిల్లా పంచాయతీ కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌ బుచ్చిరెడ్డి, జూనియర్‌ ఆడిటర్‌ నాగరాజ్‌లు ఈ అవార్డులను అందుకున్నారు. 


logo