గురువారం 02 ఏప్రిల్ 2020
Jayashankar - Jan 12, 2020 , 04:36:39

రూ.లక్ష విలువైన మొక్కలు విరాళం

రూ.లక్ష విలువైన మొక్కలు విరాళం


చిట్యాల, జనవరి 11 : మండలంలోని జూకల్‌ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ఆవరణలో పచ్చదనం పెంపొందించేందుకు రూ.లక్ష విలువగల మొక్కలను గ్రామ పెద్దలు కంది శ్రీనివాస్‌రెడ్డి, కంది సరోత్తంరెడ్డి విరాళంగా ఇచ్చినట్లు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యయులు జగదీశ్వర్‌, చంద్రశేఖర్‌ తెలిపారు. గురువారం పలురకాల పూలమొక్కలు, బోన్సా యి, నీడనిచ్చే మొక్కలను గ్రామ సర్పంచ్‌ పుట్టపాక మహేందర్‌ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులు, ఎస్‌ఎంసీ చైర్మన్‌లు జీ రమేశ్‌, ఏ తిరుపతి, ఉపసర్పంచ్‌ చాడ ఆనంద్‌రెడ్డి పాఠశాలల ఆవరణలో నాటారు. అనంతరం పాఠశాలలకు పలు రకాల విలువైన మొక్కలను ప్రదానం చేసిన దాతలకు ఉపాధ్యాయులు, సర్పంచ్‌, గ్రామస్తులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమాదేవి, రాధికారాణి , సుచరిత, వీణావాణి, సరిత, రఫీ పంచాయతీ పాలకవర్గం తదితరులు పాల్గొన్నారు.


logo