ఆదివారం 24 మే 2020
Jayashankar - Jan 12, 2020 , 04:34:40

టీఆర్‌ఎస్‌లోకి కాంగ్రెస్‌ ఎంపీటీసీ

టీఆర్‌ఎస్‌లోకి కాంగ్రెస్‌ ఎంపీటీసీ
  • -మంత్రి సమక్షంలో చేరిన ఎంఏ హమీద్‌


రేగొండ, జనవరి 11: గోరికొత్తపల్లికి చెందిన కాంగ్రెస్‌ ఎంపీటీసీ ఎంఏ హమీద్‌ టీఆర్‌ఎస్‌లో శనివారం చేరారు. మంత్రి సత్యవతిరాథోడ్‌ సమక్షంలో చేరిక జరిగింది. హమీద్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి, భూపాలపల్లిలో శనివారం జరిగిన కార్యక్రమంలో మంత్రి సమక్షలో పార్టీలో చేరారు. ఎంపీటీసీకి మంత్రి సత్యవతి రాథోడ్‌ టీఆర్‌ఎస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఎంపీ పసునూరి దయాకర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు సాంబారి సమ్మారావు, జెడ్పీటీసీ సాయిని విజయ, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మోడెం ఉమేశ్‌ గౌడ్‌, ఆలయ చైర్మన్‌ హింగె మహేందర్‌, నాయకులు పున్నం రవి, మైస భిక్షపతి, కేసిరెడ్డి ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


logo