శనివారం 04 ఏప్రిల్ 2020
Jayashankar - Jan 10, 2020 , 12:45:54

ఆదివాసీలు ఏకం కావాలి

ఆదివాసీలు ఏకం కావాలి

తాడ్వాయి, జనవరి 9: ఆదివాసీల చరిత్ర అంతమవుతున్నదని, చరిత్ర, హక్కులను కాపాడుకునేందుకు ఆదివాసీలు ఏకమై ఉద్యమించాలని పలువురు నాయకులు పిలుపుని చ్చారు. మేడారంలో ఆదివాసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆదివాసీ తెగల సమ్మేళనానికి పలు సంఘాల నాయకులు, ములుగు, భద్రాచలం ఎమ్మెల్యేలు సీతక్క, పొ దెం వీరయ్య, మాజీ ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, గు మ్మడి నర్సయ్య, చందా లింగయదొర, కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఈసం నారాయణ, అనురాధ, వివిధ ఆదివాసీ ఉపాధ్యాయ సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆదివాసీలను అణగదొక్కేందుకు కుట్రలు జరుగుతున్నాయ ని, చరిత్ర కనుమరుగయ్యే పరిస్థితి ఎంతో దూరంలో లేదన్నారు. ఆదివాసీలందరూ కలిసి కట్టుగా ఉద్యమించాల్సిన అవసం ఉందని, చరిత్రను ప్రపంచ నలుమూలలకు తెలియజేసేలా పోరాడాలని సూచించారు. సమ్మక్క-సారక్క, కొము రం భీం, రాంజీగోండ్ ఆదివాసీల హక్కుల కోసం ఉద్యమించి వారి ప్రాణాలను త్యా గం చేశారని, అందుకే భారత రాజ్యాంగంలో కొన్ని చట్టాలను రూపొందించారని తెలిపా రు. ఆ చట్టాలను అమలు చేసుకోవాల్సిన అవసరం ఉం దన్నారు. పిసా చట్టం 2006, 1/70 యాక్టు, పోడు భూ ముల హక్కుల చట్టాలను అమలు చేయాలని, సంస్కృతీ సంప్రదాయాలను కాపాడాలని కోరారు. తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కబ్బాక శ్రవణ్‌కుమార్, ఆదివాసీ విద్యార్థి సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు దబ్బగట్ల సుమన్, ఎంపీపీ గొంది వా ణిశ్రీ, మేడారం జాతర పునరుద్ధరణ కమిటీ చైర్మన్ రామ్ము ర్తి, పూనెం బాలకృష్ణ, చింత కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


logo