e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, December 9, 2021
Home జనగాం ‘కస్తూర్బాలు’.. అప్‌గ్రేడ్‌

‘కస్తూర్బాలు’.. అప్‌గ్రేడ్‌

పదో తరగతి నుంచి ఇంటర్‌ విద్యకు అవకాశం
అనుమతిచ్చిన సర్కారు
ఉమ్మడి జిల్లాలో జూనియర్‌ కళాశాలలుగా 10 కేజీబీవీలు
నిరుపేద బాలికలకు వరంలా మారిన ప్రభుత్వ ఉత్తర్వులు

నెల్లికుదురు, అక్టోబర్‌ 17: తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత చదువుల కోసం పట్టణాలకు పంపిం చలేక బడి మానేయడం, కూలీ పనులకు తీసుకె ళ్లడం, పెళ్లిళ్లు చేస్తున్నారు. దీంతో డ్రాపౌట్స్‌ సంఖ్య పెరుగడంతోపాటు బాల్య వివాహాలు ఎక్కువవుతున్నాయి. వీటిని నివారించేందుకు ప్రభుత్వం కేజీబీవీల ను పదో తరగతి నుంచి ఇంటర్‌ స్థాయికి అప్‌ గ్రేడ్‌ చేస్తున్నది. ఈ ఏడాది ఉమ్మడి జిల్లావ్యాప్తం గా 10 కస్తూర్బా విద్యాలయాలను కళాశాల స్థాయికి అప్‌గ్రేడ్‌చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేజీబీవీలో 6వ తరగతిలో అడ్మిషన్‌ పొందిన విద్యార్థిని అదే విద్యాలయంలో ఇంటర్‌ విద్యను పూర్తి చేసే సౌకర్యాన్ని అందుబా టులోకి తీసుకొచ్చింది. తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

ఉమ్మడి జిల్లాలోని అప్‌గ్రేడ్‌ అయిన కేజీబీవీలు
మహబూబాబాద్‌ జిల్లాలోని గంగారం, జయశంక ర్‌ భూపాలపల్లిలో పలిమెల, రాఘవరెడ్డిపేట, భూపాలపల్లి, మహాముత్తారం, మొగుళ్లపల్లి, రేగొం డ, ములు గు జిల్లాలోని తాడ్వాయి, ములుగు, హన్మకొండ జిల్లా లో ఐనవోలు కేజీబీవీలు కళాశాల స్థాయికి అప్‌గ్రేడ్‌ అయ్యాయి.

సౌకర్యాలు ఇవీ..
6వ తరగతిలో ఆడ్మిషన్‌ పొందిన విద్యార్థినులకు 12వ తరగతి పూర్తయ్యేం వరకు కార్పొరేట్‌ను తలద న్నే నాణ్యమైన విద్య అందుతుంది. ప్రతి రోజూ గుడ్డు, ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో భోజనం, సాయంత్రం స్నాక్స్‌, వారానికి 3 సార్లు నాన్‌వెజ్‌ అందిస్తారు.విద్యార్థినులకు 3నెలలకు అవసరమయ్యే హెల్త్‌ కిట్స్‌ను విద్యా సంవత్సరంలో 3 సార్లు అందిస్తారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement