క్యాంపు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
నర్సంపేట, ఆగస్టు 5: పట్టణంలోని మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ ఇస్తున్నట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన పట్టణంలో విలేకరులతో మాట్లాడుతూ కార్మిక శాఖ సహకారంతో శిక్షణను న్యాక్ కేంద్రం అందిస్తుందన్నారు. నర్సంపేట నియోజకవర్గంలోని మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. టైలరింగ్‌లో మూడు నెలలపాటు ఉచిత శిక్షణ ఇస్తారన్నారు. ఆసక్తిగల మహిళలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి కుట్టుమిషన్, న్యాక్ స్కిల్ టెక్నీషియన్ సర్టిఫికెట్ అందిస్తామన్నారు. 18 ఏళ్ల నుంచి 45 ఏళ్లలోపు వయస్సు గల మహిళలు అర్హులని వివరించారు. రేషన్‌కార్డు, లేబర్‌కార్డు, స్టడీ సర్టిఫికెట్, ఆధార్‌కార్డు, లేబర్ కార్డుదారుడి ఆధార్‌కార్డు, పాస్‌పోర్టు సైజ్ నాలుగు ఫొటోలు, బ్యాంకు అకౌంటు జిరాక్స్ ప్రతులు అందించాలని కోరారు. అభ్యర్థులు నర్సంపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.