e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home జయశంకర్ ఆదర్శ డివిజన్‌గా అభివృద్ధి చేస్తా

ఆదర్శ డివిజన్‌గా అభివృద్ధి చేస్తా

ఆదర్శ డివిజన్‌గా అభివృద్ధి చేస్తా

సమస్యలకు శాశ్వత పరిష్కారం
టీఆర్‌ఎస్‌ 29వ డివిజన్‌ అభ్యర్థి గుండు సుధారాణి
చివరి రోజు జోరుగా ప్రచారం

వరంగల్‌, ఏప్రిల్‌ 27 : గ్రేటర్‌ కార్పొరేషన్‌లోనే డివిజన్‌ను ఆదర్శంగా అభివృద్ధి చేస్తానని టీఆర్‌ఎస్‌ 29వ డివిజన్‌ అభ్యర్థి గుండు సుధారాణి అన్నారు. మంగళవారం డివిజన్‌లో ఆమె విస్తృతంగా ప్రచారం చేశారు. గడపగడపకూ తిరుగుతూ కారు గుర్తుకు ఓటెయ్యాలని అభ్యర్థించారు. డివిజన్‌లోని పాపయ్యపేట, రామన్నపేట ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. చివరి రోజు ప్రచారంలో ఆమెకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఇంటింటికీ మహిళలు బొట్టు పెట్టి స్వాగతం పలికారు. మహిళలు, కార్యకర్తలు వెంట తరలిరాగా, గుండు సుధారాణి ఇంటింటి ప్రచారం జోష్‌గా సాగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటెయ్యాలని కోరారు. పేదల ఆర్థికాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ రూ.వందల కోట్లతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ పథకాల గురించి వివరించారు. పేదల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అండగా నిలిచి, కారు గుర్తుకే ఓటు వేయాలని కోరారు. మరోసారి ఆశీర్వదించి, అధిక మెజార్టీలో గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు.
చివరి రోజు విస్తృత ప్రచారం
గ్రేటర్‌ ఎన్నికల్లో భాగంగా చివరి రోజు ప్రచారంలో గుండు సుధారాణి డివిజన్‌లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఉద యం నుంచి సాయంత్రం వరకు అన్ని ప్రాంతాల్లో ఇంటింటికీ తిరుగుతూ కారు గుర్తుకే ఓటెయ్యాలని అభ్యర్థించారు. ప్రచారం ముగుస్తున్న తరుణంలో ఆమె డివిజన్‌లోని అన్ని ప్రాంతాల్లో ప్రచారం చేస్తూనే ముఖ్యులను ప్రత్యేకంగా కలుసుకుని ఓటెయ్యాలని కోరారు. ప్రచారంలో మాజీ జడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ సాంబారి సమ్మారావు, తాజా మాజీ కార్పొరేటర్‌ గుండు ఆశ్రితావిజయ్‌రాజ్‌, కల్పలత సూపర్‌మార్కెట్‌ వైస్‌చైర్మన్‌ షఫీ, డివిజన్‌ నాయకులు కొడకండ్ల సదాంత్‌, రాచర్ల రాము, పూజరి కుమారస్వామి, తాళ్లపల్లి రమేశ్‌, రుద్ర శ్రీనివాస్‌, పీ కుమారస్వామి, గట్టు చందుగౌడ్‌, గుండు శ్రీనివాస్‌, చంద్రమౌళి, నవీన్‌, సబ్బని రాజు, శ్రీను, శ్రీనాథ్‌, తత్తరి రవి, సామల శ్రీనివాస్‌, మామిడాల రాజు, శ్రీనాథ్‌, రాచర్ల జగన్‌, గుల్లపల్లి రాజు, సంజీవ్‌, ముస్కు సతీశ్‌, నూర రాజు, నక్క జ్యోతి, తైసీన్‌, తాళ్ల సురేశ్‌, సంతోష్‌, రామకృష్ణ, సారంగం పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆదర్శ డివిజన్‌గా అభివృద్ధి చేస్తా

ట్రెండింగ్‌

Advertisement