e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, July 30, 2021
Home జనగాం పోలీసులపై నిందలు

పోలీసులపై నిందలు

  • పాదయాత్రలో వారే టార్గెట్‌గా ‘ఈటల’ మాటలు
  • అవహేళన చేస్తూ హెచ్చరికలు
  • బీజేపీ నాయకుల తీరుపై సర్వత్రా విమర్శలు
పోలీసులపై నిందలు

కమలాపూర్‌, జూలై21: ప్రజాప్రతినిధులు, ప్రజల శ్రేయస్సు కోసం తమ ప్రాణాలను పణం గా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న పోలీసులే టార్గెట్‌గా బీజేపీ నేత ఈటల రాజేందర్‌ మాట్లాడుతున్న మాటలు స్థానికంగా చర్చనీయాంశమవుతున్నా యి. ప్రజాదీవెన పాదయాత్ర పేరుతో ఈ నెల 19న కమలాపూర్‌ మండలంలోని బత్తినివాని పల్లిలో ప్రారంభమైన యాత్ర మూడు రోజులు కమలాపూర్‌ మండలంలో కొనసాగి ఇల్లంత కుంట మండలంలోకి ప్రవేశించింది. పాదయా త్ర లో భాగంగా శనిగరం, నేరెళ్ల, గూడూరు తదితర గ్రామాల్లో జరిగిన సభల్లో ఈటల రాజేందర్‌ భద్ర త కోసం వచ్చిన పోలీసులను చులకన చేస్తూ మా ట్లాడారు. ‘గులాబీ నేతలకు గులాం చేస్తున్నారు.. గులాబీ కండువా కప్పుకొని రాండ్రి..’ అంటూ కించపరిచే వ్యాఖ్యలు చేశారు.

‘పోలీసులు మఫ్టీ లో ఉండి మా కార్యకర్తలను ఇబ్బందులు పెడుతు న్నరు.. ఖబడ్దార్‌’ అంటూ హెచ్చరించడం గమనా ర్హం. పాదయాత్ర శాంతియుతంగా సాగాలని బం దోబస్తు నిర్వహిస్తున్న పోలీసులపై ఈటల ఇ లాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. ఈటల రాజేందర్‌కు ప్రత్యర్థి టీఆర్‌ఎస్‌ పార్టీనా? లేక పోలీసులా? అని చర్చించుకుంటున్నారు. ప్ర జా శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తున్న పోలీసులను గౌరవించాల్సింది పోయి బీజేపీ నాయకులు సం స్కారం లేకుండా మా ట్లాడడం బాధాకర మం టూ పలువురు పోలీసు అధికారులు వాపోతు న్నా రు. ఉద్యోగులుగా తమ విధులు నిర్వర్తిస్తున్న పోలీ సులను గుర్తించాల్సిన నాయకులు సభల్లో చులకన చేసి మాట్లాడితే గౌరవం ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పోలీసులపై నిందలు
పోలీసులపై నిందలు
పోలీసులపై నిందలు

ట్రెండింగ్‌

Advertisement