కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 22 నుంచి 31వరకు ఢిల్లీలో ‘షహర్ సమృద్ధి ఉత్సవ్’ పేరిట నిర్వహించే స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల ఎగ్జిబిషన్‌కు వరంగల్ మహిళా సంఘాలు ‘భద్రకాళి’ బ్రాండ్ పేరిట ఉత్పత్తి చేస్తున్న ప్లవర్ ధూప్‌స్టిక్స్, దర్రీస్ ఎంపికయ్యాయి. ఎలాంటి రసాయనాలూ వాడకుండా పూలపొడితో తయారు చేస్తున్న ధూప్‌స్టిక్స్, డోర్ మ్యాట్లు, కర్టెన్లు, యోగా మ్యాట్లు, కార్పెట్లను ఇందులో ప్రదర్శించనున్నారు. ఢిల్లీ ఎగ్జిబిషన్‌కు ఎంపికైన దేశంలోని మహిళా సంఘాల ఉత్పత్తులను ‘సోన్చిరయా’ బ్రాండ్ ట్యాగ్‌తో విక్రయించనున్నారు. అంతేకాకుండా వరంగల్‌కు చెందిన 2వేల ఉత్పత్తులు ఫ్లిప్‌కార్ట్ ద్వారా అంతర్జాతీయ మార్కెట్లోకి రానున్నాయి. ఈమేరకు సంస్థతో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ అధికారులు జరిపిన చర్చలు సఫలీకృతమయ్యాయి.
వరంగల్, సెప్టెంబర్ 22 : మగువ తలుచుకుంటే ఏదైనా సాధించగలదని వరంగల్ మహిళలు నిరూపించారు. ఆతైస్థెర్యమే పెట్టుబడిగా చిన్నచిన్న ఉత్పత్తులతో మొదలై ఇప్పుడు జాతీయ మార్కెట్లో పేరు సంపాదిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 22 నుంచి 31వరకు దేశ రాజధాని ఢిల్లీలో ‘షహర్ సమృద్ధి ఉత్సవ్’ పేరిట స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల ఎగ్జిబిషన్లో ప్రదర్శనకు వరంగల్ మహిళా సంఘాలు తయారు చేస్తున్న ప్లవర్ ధూప్‌స్టిక్స్, దర్రీస్ ఉత్పత్తులు ఎంపిక అయ్యాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా పూలతో ధూప్‌స్టిక్స్ తయారుచేయడం విశేషం. ఎలాంటి రసాయనాలు వినియోగించకుండా పూలపొడితో తయారు చేస్తున్న ధూప్స్టిక్స్ను ఎగ్జిబిషన్లో ప్రదర్శించనున్నారు. ధూప్ స్టిక్స్‌తోపాటు పూలపొడితో తయారు చేసిన వివిధ రకాల ఆర్టికల్స్‌ను డిస్ప్లే చేయనున్నారు. పూలతో ధూప్ స్టిక్స్, ఆర్టికల్స్ తయారీపై మెప్మా అధికారులు రెండేళ్ల క్రితం నాగ్‌పూర్ నుంచి శిక్షకులను పిలిపించి శిక్షణ ఇప్పించారు. దేశవ్యాప్తంగా మహిళా సంఘాలు చేస్తున్న ఉత్పత్తులను ‘సోన్చిరయా’ బ్రాండ్‌తో విక్రయించనున్నారు. ఎగ్జిబిషన్‌కు వరంగల్ నుంచి రెండు ఉత్పత్తులు ఎంపిక కావడంపై వారిలో మరింత ఉత్సాహం నింపుతోంది. ఇప్పటికే శానిటరీ న్యాప్కిన్స్ తయారు చేస్తున్న మహిళా సంఘాలు అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు సరఫరా చేస్తున్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో కంపోస్ట్ ఎరువులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటోంది.
సోన్చిరయా బ్రాండ్‌తో విక్రయాలు
ఢిల్లీ ఎగ్జిబిషన్లో మహిళా సంఘాలు చేసిన ఉత్పత్తులను సోన్చిరయా బ్రాండ్‌తో అమ్మకాలు చేయనున్నారు. ఇప్పటికే ఎగ్జిబిషన్లో విక్ర యాల కోసం తయారు చేస్తున్న ఉత్పత్తులకు సోన్చిరయా పేరుతో ట్యాగ్లు వేస్తున్నారు. ఢిల్లీ ఎగ్జిబిషన్‌కు ఎంపిక అయిన ఉత్పత్తులను పెద్ద ఎత్తున తయారుచేస్తున్నారు. మరో నెల రోజుల్లో ఎగ్జిబిషన్ ఉండడంతో తయారీపై దృష్టిసారిస్తున్నారు.
త్వరలోనే ఫ్లిప్‌కార్ట్‌లో చోటు
అంతర్జాతీయ మార్కెట్లో మంచి పేరున్న ఫ్లిప్‌కార్ట్‌లో వరంగల్ స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు చోటు దక్కనుంది. ఇప్పటికే మున్సిపల్ ఉన్నతాధికారులు ఆ సంస్థతో జరిపిన చర్చలు సఫలీకృతమైనట్లు మెప్మా అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాలు తయారుచేస్తున్న 21వేల ఉత్పత్తులను ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయాలు జరుపాలని అధికారులు భావిస్తున్నారు. దీనిలో భాగంగానే వరంగల్ జిల్లాల నుంచి సుమారు 2వేల ఉత్పత్తులను ఫ్లిప్‌కార్ట్‌లో ఉంచాలని నిర్ణయించారు. ధూప్‌స్టిక్స్, దర్రీస్ ఉత్పత్తుల్లో యోగా మ్యాట్స్, డోర్ కర్టెన్స్, కార్పెట్స్, భూమి సంవర్థిని ఎరువులు, హోమ్‌ఫుడ్స్, పచ్చళ్లు, మసాలాలు, ఇమిటేషన్ జ్యువెల్లరీ, త్రెడ్డింగ్ బ్యాంగిల్స్, ఆర్టికల్స్ ఇలా అనేక రకాల వస్తువులను ఎంపిక చేస్తున్నారు. క్వాలిటీ, క్వాంటిటీతో పాటు ధరను నిర్ణయించే పనిలో నిమగ్నమయ్యారు. త్వరలోనే ఫ్లిప్కార్ట్ట్లో స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులు అందుబాటులోకి రానున్నాయి.