e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home జనగాం వ్యాక్సినేషన్‌ వందశాతం పూర్తి చేయాలి

వ్యాక్సినేషన్‌ వందశాతం పూర్తి చేయాలి

  • ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
  • నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
  • జిల్లా వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రారంభం
  • 18 సంవత్సరాలు నిండిన వారందరికీ టీకాలు వేయనున్న వైద్యసిబ్బంది

దుగ్గొండి, సెప్టెంబర్‌ 16 : జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన వారందరూ తప్పకుండా కొవిడ్‌ టీకా వేసుకోవాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. గురువారం దుగ్గొండిలోని ప్రాథమిక ఆరో గ్య వైద్య కేంద్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య సిబ్బంది పీహెచ్‌సీలో నిత్యం కరోనా వాక్సినేషన్‌, నిర్ధారణ పరీక్షలు చేయాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఆకుల శ్రీనివాస్‌, ఎంపీపీ కాట్ల కోమల, వైస్‌ ఎంపీపీ జేపాల్‌రెడ్డి, మండల ప్రత్యేకాధికారి శ్రీనివాస్‌రావు, ఎంపీడీవో కృష్ణప్రసాద్‌, ఎంపీవో శ్రీధర్‌గౌడ్‌, పీఏసీఎస్‌ చైర్మన్లు సుకినె రాజేశ్వర్‌రావు, ఊరటి మహిపాల్‌రెడ్డి, వైద్యాధికారులు రాజు, పొన్నం మొగిళి, గుండెకారి రంగారావు, ముదురుకోళ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

నర్సంపేట : జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ వేస్తున్నామని డీఎంహెచ్‌వో వెంకటరమణ అన్నారు. నర్సంపేటలోని సెక్షన్‌ -1ను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడు తూ.. స్పెషల్‌ వ్యాక్సినేషన్‌ మాస్‌ డ్రైవ్‌ నేటి నుంచి ప్రారంభమైందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో ప్రకాశ్‌, అనిల్‌కుమార్‌, డాక్టర్‌ గోపాల్‌రావు, వైద్యాధికారి భూపేష్‌, మార్త, సంజీవరావు, జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

గీసుగొండ : కరోనా టీకాలు అర్హులందరూ వేసుకోవాలని జడ్పీటీసీ పోలీసు ధర్మారావు అన్నారు. గీసుగొండలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో కరో నా వ్యాక్సినేషన్‌ కేంద్రం ప్రారంభించారు. కార్యక్రమంలో కూడా డైరెక్టర్‌ వీరగోని రాజ్‌కుమార్‌, సర్పంచ్‌ దౌడు బాబు, వైద్యాధికారి మాధవీలత, ఎంపీడీవో రమేశ్‌, ఎంపీవో ప్రవీణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

పర్వతగిరి : మండలంలోని ఆరోగ్య ఉపకేంద్రాల్లో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ను నిర్వహించినట్లు పీహెచ్‌సీ వైద్యాధికారి ప్రసాద్‌ తెలిపారు. 18 ఏళ్లు నిం డిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేసుకోవాలన్నారు.

వర్ధన్నపేట : గ్రామాల్లో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేసుకోవాలని ఎంపీడీవో రాజ్యలక్ష్మి, ఏడీఏ సురేశ్‌కుమార్‌ కోరారు. ఇల్లంద గ్రామంలోని సబ్‌సెంటర్‌లో వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని ఎంపీడీవో, ఏడీఏలు ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సాంబయ్య, ఎంపీటీసీ శ్రీనివాస్‌, పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ అమృతవల్లి పాల్గొన్నారు.

సంగెం : అర్హులందరూ టీకా వేసుకోవాలని సర్పం చ్‌ గూడ కుమారస్వామి, ఎంపీటీసీ కొనకటి రాణి అ న్నారు. మండలంలోని మొండ్రాయి, తీగరాజుపల్లిలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రం ప్రారంభించారు. సోమ, మంగళ, గురు, శుక్ర వారాల్లో టీకా కార్యక్రమం ఉం టుందన్నారు. ఉపసర్పంచ్‌ పెండ్లి శారద, టీఆర్‌ఎస్‌ నాయకులు కొనకటి మొగిలి, గండ్రకోటి రవి, తీగరాజుపల్లి సర్పంచ్‌ రమ, ఎంపీటీసీ రంగరాజు నర్సింహస్వామి, ఏఎన్‌ఎం నిర్మలజ్యోతి పాల్గొన్నారు.

కరీమాబాద్‌ : కొవిడ్‌ టీకాలను 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తీసుకోవాలని కార్పొరేటర్లు సోమిశెట్టి ప్రవీణ్‌, వేల్పుగొండ సువర్ణ, పోశాల పద్మ కోరారు. గురువారం 35, 37, 41వ డివిజన్లలో ఏర్పాటు చేసి న వ్యాక్సినేషన్‌ సెంటర్లను వారు పరిశీలించారు. ప్రభు త్వ చర్యలకు ప్రజలు సహకరించాలన్నారు.

నర్సంపేట రూరల్‌ : మండలంలోని భాంజీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు అన్ని సబ్‌ సెంటర్లలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కొనసాగింది. మహేశ్వరం, లక్నేపల్లి గ్రామాల్లో కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌ను ఎంపీడీవో అజ్మీరా నాగేశ్వరరావు, ముగ్ధుంపురంలో ఎంపీవో అంబటి సునీల్‌కుమార్‌రాజ్‌ పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు మాడ్గుల కవిత, గొడిశాల రాంబాబు, పెండ్యాల జ్యోతి, ఎంపీటీసీ ఉల్లేరావు రజి త, కార్యదర్శులు కల్పన, అనిత పాల్గొన్నారు.

చెన్నారావుపేట : మండలంలోని అర్హులందరూ టీ కా వేసుకొనేలా ఆశ కార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లు అవగాహన కల్పించాలని మండల స్పెషలాఫీసర్‌ బాలకృష్ణ అన్నారు. కోనాపురంలో ఏర్పాటు చేసిన కరోనా వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని సందర్శించారు. ఆయన వెంట ఎంపీపీ బాదావత్‌ విజేందర్‌, వైద్యాధికారి ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.

నెక్కొండ : నెక్కొండ, రెడ్లవాడ జీపీల్లో, దీక్షకుంటలోని రైతు వేదిక ఆవరణలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేశారు. రెడ్లవాడలో సర్పంచ్‌ రావుల శ్రీలత, దీక్షకుంటలో సర్పంచ్‌ ఆలకుంట సురేందర్‌, హరిశ్చంద్రు తండా సర్పంచ్‌ వీరూనాయక్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభించారు. అలంకానిపేట పీహెచ్‌సీ పరిధిలో 370 మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు వైద్యాధికారి సుమంత్‌ తెలిపారు.

నల్లబెల్లి : అర్హత కలిగిన వారందరూ కరోనా వ్యాక్సిన్‌ వేసుకోవాలని ఎంపీపీ ఊడుగుల సునీత అన్నారు. నందిగామ గ్రామంలోని పీహెచ్‌సీ, సబ్‌సెంటర్లలో కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని స్పెషలాఫీసర్‌ జహీరుద్దీన్‌తో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీవో విజయ్‌కుమార్‌, ఎంపీవో కూచన ప్రకాశ్‌, వైద్యాధికారి మహేందర్‌నాయక్‌, కార్యదర్శి అజ్మతుల్లా తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement