హనుమకొండ సిటీ, సెప్టెంబర్15 : పరుగు పందెంలో రాణించేందుకు గుంతలమయమైన మట్టి ట్రాక్‌లపైనే ప్రాక్టీస్ చేసి జిల్లాకు బంగారు పతకాలు తెచ్చిన నాటి అథ్లెట్స్, జేఎన్ఎస్లో సక ల హంగులతో సిద్ధమై 60వ నేషనల్ అథ్లెటిక్ పో టీలకు వేదికగా నిలిచిన సింథటిక్ ట్రాక్‌ను చూసి మురిసిపోతున్నారు. దానిని చూసి వారి క్రీడా జీవితంలో పరుగు కోసం మట్టి ట్రాక్‌పై ఊపిరిబి గపట్టి చేసిన సాధనను నెమరేసుకుంటున్నారు. ప్రస్తుతం అథ్లెటిక్స్‌లో రాణించాలనుకునే క్రీడాకా రులకు ఈ సింథటిక్ ట్రాక్ గొప్ప వరమని చెబు తున్నారు. వానకాలంలో మట్టి ట్రాక్ చిత్తడిగా మారినా లక్ష్య సాధన కోసం ట్రాక్ బోర్డర్లపై, అ ప్పటికప్పుడు ప్రత్యామ్నాయదారులను వెతుక్కొ ని పరుగెత్తి పతకాలు సాధించి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సాధించామని,అథ్లెటిక్స్‌లో రాణించా లనుకునేవారికి ఈ ట్రాక్ చాలా ఉపయోగపడు తుందని చెబుతున్నారు. ఇప్పుడు వరంగల్‌లో ట్రాక్ నిర్మించడం, నేషనల్ అథ్లెటిక్స్ పోటీలు ని ర్వహించడం ద్వారా ఇక్కడి యువతకు అథ్లెటిక్స్‌పై మంచి అవగాహన వస్తుందని పేర్కొంటున్నారు.
ఆ ట్రాక్‌పైనే పతకాలు సాధించాం
ఆ రోజుల్లో మట్టి ట్రాక్‌పైనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో స్టేట్ లెవల్, నేషనల్ లేవ ల్లో 100 మీటర్, లాంగ్‌జంప్ 7 మీట ర్స్‌లో పాల్గొని పతకాలు సాధించా. ఇప్పడు సింథటిక్ ట్రాక్ నిర్మాణం అం దుబాటులోకి రావడం వరంగల్ యువ తకు సువర్ణావకాశం. స్పోర్ట్స్ కో టాలోనే ఎస్సైగా ఉద్యోగం సాధించాను. ఇప్పటికీ గ్రౌండ్‌కు వస్తా.
ఆసక్తి పెరిగేలా ట్రాక్ నిర్మాణం
హైదరాబాద్ తర్వాత వరంగల్‌లో అత్యద్భుతంగా ట్రాక్‌ను తీర్చిదిద్దారు. 1995-2000 మధ్య కాలంలో మేము అథ్లెటిక్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మట్టి ట్రాక్‌లపైనే ప్రాక్టీస్ చేసి పతకాలు తెచ్చినం. 2002 సంవత్సరంలో హమ్మర్ త్రో విభాగంలో బెంగళూర్ వేదికగా జరిగిన సౌత్ ఇండియా అథ్లెటిక్స్ పోటీల్లో గోల్డ్ మెడల్స్ సాధించాం. స్పోర్ట్స్ హాస్టల్లోనే ఉంటూ పోటీల్లో పాల్గొని 2004లో స్పోర్ట్స్ కోటాలో కాని స్టేబుల్ ఉద్యోగం సాధించా. అప్పుడు పోటీల్లో రాణించేందుకు చాలా శ్రమించాం.
ఓరుగల్లు అథ్లెట్స్‌కు పండుగ
మేం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో చాలా ఒడిదొడుకులు ఎదుర్కొని చాం పియన్లుగా నిలిచాం. ఇప్పుడు ఓరుగ ల్లు అథ్లెటిక్స్‌కు పండుగ. ఇక్కడ మట్టి రోడ్లపై ప్రాక్టీస్ చేసి పోటీల్లో సింథటిక్ ట్రాక్‌పై పరుగెత్తాలంటే కొంత భయం కూడా ఉండేది. లాంగ్‌జంప్, త్రిబుల్ జంప్, 100 మీటర్లలో రాణిస్తూ 2009లో సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని పొందా.
సంతోషంగా ఉంది
ఖో-ఖో ప్లేయర్‌గా రోజూ జేఎన్ఎ స్లో మట్టి ట్రాక్‌పైనే రన్నింగ్ ప్రాక్టీస్ చేసేది. ఆ కాలంలో వర్షం వచ్చిందం టే గ్రౌండ్ జోలికి వెళ్లకపోయేది. 2002లో కటక్‌లో జరిగిన 32వ నేషన ల్ అథ్లెటిక్స్‌లో అండర్-18 విభాగం లో 110 హార్డిల్స్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించా. స్పోర్ట్స్ కోటాలో కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు వరంగల్‌లో సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేసుకోవడం సంతోషం.
– కే శ్యాంసుందర్, కానిస్టేబుల్, శనిగరం, మహబూబాబాద్