e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Home జనగాం ‘గణనాథుల విగ్రహాల ఏర్పాటుతో భక్తిభావం’

‘గణనాథుల విగ్రహాల ఏర్పాటుతో భక్తిభావం’

నర్సంపేట/చెన్నారావుపేట/దుగ్గొండి, సెప్టెంబర్‌ 14: వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలందించడం వల్ల ప్రజల్లో భక్తిభావం పెంపొందుతుందని నర్సంపేట మున్సిపల్‌ 9వ వార్డు కౌన్సిలర్‌ రాయిడి కీర్తిదుశ్యంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం 9వ వార్డు పరిధిలో ఏర్పాటు చేసిన వినాయ మండపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అలాగే, 19వ వార్డులో అన్నదానం చేశారు. కౌన్సిలర్‌ పెండెం లక్ష్మీరామానంద్‌, భక్తులు గొడిశాల రవి, అనిల్‌, హనుమాన్‌ యూత్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. చెన్నారావుపేట మండలం జల్లి గ్రామంలో గణపతి యూత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద కిరాణా షాపు నిర్వాహకులు అన్నదానం చేశారు.

కార్యక్రమంలో కొడకండ్ల భిక్షపతి, కొడకండ్ల శ్రీధర్‌-రజిని, కొడకండ్ల వినయ్‌-ప్రియాంక, కొడకండ్ల శ్రీనివాస్‌-సుష్మ, గణపతి యూత్‌ ప్రెసిడెంట్‌ సునీల్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ అశోక్‌, కార్యదర్శి రాజు, విజేందర్‌, వీరన్న, భాస్కర్‌, రమేశ్‌ పాల్గొన్నారు. దుగ్గొండితో పాటు నాచినపల్లిలో నవయుగ యువజన సంఘం ఆధ్వర్యంలో వినాయక మండపాల వద్ద దాతలు అన్నదానం చేశారు. నాచినపల్లిలో పీఎస్సై మహేందర్‌, సర్పంచ్‌ పండ్యాల మమతారాజు, ఉపసర్పంచ్‌ జంగ రాజిరెడ్డి, ఎంపీటీసీ మమతామోహన్‌ పాల్గొన్నారు. నెక్కొండలో యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని డీఎస్పీ పుప్పాల తిరుమల్‌, ఎస్సై నాగరాజు ప్రారంభించారు. సర్పంచ్‌ సొంటిరెడ్డి యమున-రంజిత్‌రెడ్డి, యూత్‌ బాధ్యులు శ్రీరంగం సంపత్‌, కుసుమ చెన్నకేశవులు, మోడెం సురేశ్‌, మేరుగు విజయ్‌ పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana