e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, December 9, 2021
Home జనగాం ధాన్యం కొనుగోలులో అవకతవకలపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సీరియస్‌

ధాన్యం కొనుగోలులో అవకతవకలపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సీరియస్‌

చేర్యాల, అక్టోబర్‌ 18 : ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని సోమవారం చేర్యాల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ పుర్మ వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు జనగామ జిల్లా కేంద్రంలో కలిశారు. పట్టణంతో పాటు చేర్యాల ప్రాంతంలో రోడ్ల మరమ్మతులు తదితర సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయారు.

ఈ సందర్భంగా చేర్యాలలో వారు విలేకరులతో మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరిగిన అవకతవకల విషయంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. అక్రమాలతో సంబంధం ఉన్న ప్రతి అధికారి, సిబ్బంది, మిల్లర్ల పై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలతో పాటు శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఎమ్మెల్యే ప్రత్యేకంగా లేఖలు పంపించినట్లు తెలిపారు.

- Advertisement -

అలాగే రోడ్లను వెంటనే మరమ్మతులు చేయించేందుకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు అంకుగారి శ్రీధర్‌రెడ్డి, మల్లన్న ఆలయ మాజీ చైర్మన్‌ ముస్త్యాల కిష్టయ్య, కౌన్సిలర్‌ పచ్చిమడ్ల సతీశ్‌, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ జిల్లా రాజేశం తదితరులున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement