e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home జనగాం అభివృద్ధికి చిరునామా సీత్లాతండా

అభివృద్ధికి చిరునామా సీత్లాతండా

అభివృద్ధికి చిరునామా సీత్లాతండా

పల్లె ప్రగతితో మారిన రూపురేఖలు
రెండెకరాల్లో ప్రకృతి వనం
30 గుంటల్లో అన్ని వసతులతో వైకుంఠధామం
అద్దాల్లా మెరుస్తున్న రోడ్డు

మహబూబాబాద్‌, ఏప్రిల్‌ 11 (నమస్తే తెలంగాణ): తండాలను గ్రామపంచాయతీలు చేస్తే ఏమి వస్తుందనే వారికి మహబూబాబాద్‌ మండలం సీత్లాతండా ఉదాహరణగా నిలిచింది. ఒకప్పుడు ఈదుల పూసపల్లి జీపీ పరిధిలోని ఈ తండా ఉండే ది. ఈదులపూసపల్లి మహబూబాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో కలిసింది. దీంతో సీత్లతండా ప్రత్యేక జీపీగా ఏర్పడింది. ఈ గ్రామంలో ప్రభుత్వం ఇప్పటివరకు మూ డు సార్లు నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమం తండా రూపురేఖలనే మార్చేసింది.
నాలుగు ఒకే చోట..
సీత్లతండాలో పల్లెప్రగతిలో భాగంగా రెండెకరాల విశాలమైన స్థలంలో పల్లెప్రకృతి వనం, 30 గుంటల భూమిలో వైకుంఠధామం, 10 గుంటల భూమిలో కంపోస్ట్‌యార్డును నిర్మించారు. పల్లెప్రకృతి వనం, నర్సరీ, వైకుంఠధామం, కంపోస్ట్‌ యార్డ్‌ ఒకే చోట నిర్మించారు. దీంతో తండావాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పల్లెప్రకృతి వనంలో వివిధ రకాల మొక్కలను నాటారు. మధ్యలో వాకింగ్‌ట్రాక్‌ ఏర్పాటు చేశారు. విలేజ్‌ పార్కులో తండావాసులు ఉదయం, సాయంత్రం వచ్చి ఆహ్లాదం పొందుతున్నారు.
మెరుస్తున్న రోడ్లు..
సీత్లతండాలో రూ. 22 లక్షలతో సీసీ రోడ్లను నిర్మించారు. రోజూ తడి, పొడి చెత్తను వేరు చేసి గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌ ద్వారా తరలిస్తున్నా రు. ఎప్పటికప్పుడు మురుగు కాల్వలు శుభ్రం చేస్తున్నారు. నిత్యం గ్రామాభివృద్ధి కోసం అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాటుపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

వకీల్ సాబ్ సినిమాలో పవన్ తెలంగాణ యాసకు కారణం ఇదే..

IPL 2021: టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న సన్‌రైజర్స్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అభివృద్ధికి చిరునామా సీత్లాతండా

ట్రెండింగ్‌

Advertisement