e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home జనగాం మనకు మరో ఎన్ హెచ్

మనకు మరో ఎన్ హెచ్

మనకు మరో ఎన్ హెచ్

ఏడేళ్లుగా అప్పటి ఎంపీ వినోద్‌కుమార్‌ కృషికి ఫలితం
నేషనల్‌ హైవేస్‌ @ వరంగల్‌
‘గ్రేటర్‌’ చుట్టూ జాతీయ రహదారులే
కొత్త రోడ్లతో మారనున్న ముఖచిత్రం
దేశంలోని అన్ని రాష్ర్టాలకూ కనెక్టివిటీ
వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు ఊతం
విభజన చట్టం మేరకే మంజూరు
రెండు రోడ్లకు మధ్యలో ఎల్కతుర్తి
సరి కొత్త రెసిడెన్షియల్‌ జోన్‌
ఊపందుకోనున్న రియల్‌ వ్యాపారాలు

వరంగల్‌ సబర్బన్‌, మార్చి 26: జగిత్యాల-కరీంనగర్‌-వరంగల్‌-ఖమ్మం, మెదక్‌-సిద్దిపేట-హుస్నాబాద్‌-ఎల్కతుర్తి రోడ్లను జాతీయ రహదారులుగా మార్చాలను ఎప్పటి నుంచే రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. ఈ మేరకు అనేక సార్లు సీఎం కేసీఆర్‌, ఎంపీలు, ముఖ్యంగా మాజీ ఎంపీ బోయినపల్లి వినో ద్‌కుమార్‌ ఏడేళ్లుగా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని కలిసి ఈ రోడ్ల ఆవశ్యకతను స్వయంగా వివరించారు. రాష్ట్ర విభజన సమ యంలో తెలంగాణలో జాతీయ రహదారుల సగటు తక్కువ గా ఉండడంతో మొత్తం 18 రోడ్లను నేషనల్‌ హైవేస్‌గా గు ర్తించాలని 2014 నుంచే మన ఎంపీలు పోరాటం చేస్తున్నా రు. ఇందులో భాగంగానే ఎట్టకేలకు మొదటగా జగిత్యాల-వరంగల్‌ రోడ్డు నిర్మాణానికి ఆమోదం తెలిపారు. ప్రస్తుతం భూసేకరణ పనులు నడుస్తున్నాయి. అయితే మెదక్‌ ఎల్క తుర్తి రోడుకు మాత్రం మోక్షం లభించలేదు. రాష్ట్ర ప్రభుత్వం వెంట పడడంతో కదిలిన కేంద్రం ఈ దారికి కూడా పచ్చ జెం డా ఊపింది. 133 కిలోమీటర్ల రోడ్డు నిర్మించేందుకు గెజిట్‌ ను విడుదల చేసింది. ఈ రెండు రోడ్లు పూర్తయితే వరంగల్‌ చుట్టూరా రోడ్లు సరికొత్త శోభను సంతరించుకోనున్నాయి.

అన్ని రాష్ర్టాలకు కనెక్టివిటీ
వరంగల్‌ నుంచి దేశంలోని అన్ని రాష్ర్టాలకు సులభంగా వెళ్లేలా ఇప్పుడు జాతీయ రహదారులు రూపుదిద్దుకోనున్నా యి. మెదక్‌ దారితో మహారాష్ట్ర, కర్ణాటక, కరీంనగర్‌ వైపు నుంచి వచ్చే రహదారితో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఉత్తర ప్ర దేశ్‌, పశ్చిమ బెంగాల్‌, బీహార్‌, అస్సాం లాంటి రాష్ర్టాలకు వెళ్ల వచ్చు. ఇక ఖమ్మం రహదారిలో ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ర్టాలకు వెళ్లవచ్చు. ఇక హైదరాబాద్‌కు ప్ర యాణ సమయం ఇప్పటికే చాలా తగ్గింది. ఈ కొత్త జాతీయ రహదారుల నిర్మాణాలు పూర్తయితే వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు మంచి లాభాలు జరుగనున్నాయనే అభిప్రాయా లు వ్యక్తమవుతున్నాయి. మన ప్రాంతంలో విత్తన ఉత్పత్తి అధికంగా జరుగుతుంది. కోతల తర్వాత నిర్ణీత సమయంలో ఆయా కంపెనీల స్టోరేజ్‌కు సదరు ధాన్యం చేరేందుకు ఈ రోడ్లు దోహదపడుతాయి. ఇక గ్రానైట్‌, కోళ్లు, చేపల పరిశ్రలకు ఎక్కువ లాభం జరుగనుంది.

రెండు రోడ్లకు జంక్షన్‌గా ఎల్కతుర్తి
వరంగల్‌ నగరానికి కూత వేటు దూరంలో ఉన్న ఎల్కతుర్తి మండలం కేంద్రం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. మొ న్నటి వరకు కరీంనగర్‌ జిల్లా మూలన విసిరేసినట్లుగా ఉన్న ఎల్కతుర్తి ఇప్పుడు పునర్విభజనలో భాగంగా వరంగల్‌ అర్బన్‌ జిల్లాకు వచ్చింది. ఇదే తరుణంలో కరీంనగర్‌ నుంచి ఎన్‌హెచ్‌-563తోపాటు, మెదక్‌ నుంచి వచ్చే జాతీయ రహదార్లు రెండు ఎల్కతుర్తి వద్దనే కలుసుకోనున్నాయి. దీం తో ఇది రెండు రోడ్ల జంక్షన్‌గా అభివృద్ధి చెందనుంది. ఇప్పటికే ఎల్కతుర్తికి కిలోమీటర్‌ దూరంలో ఎస్సార్‌ యూనివర్సిటీ ఉండగా, 80 ఎకరాల్లో ఆహ్లాదకరమైన పార్కును అభివృద్ధి చేస్తున్నారు. దీంతో భవిష్యత్‌లో ఎల్కతుర్తి మంచి రెసిడెన్షియ ల్‌ జోన్‌గా మారడంతోపాటు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పుం జుకునే అవకాశముంది. ఈ రోడ్లు పూర్తయితే ఓరుగల్లు ముఖ చిత్రం సమూలంగా మారనుందనే అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి. ఎల్కతుర్తి నుంచి సిద్దిపేట వర కు భూ సేకర ణ సమస్య లేకపోవడంతో ఈ 60 కిలోమీటర్ల రోడ్డు మొదటి దశలోనే పూర్తి చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

వెంటపడితేనే పనయ్యింది..
మెదక్‌-ఎల్కతుర్తి రహ దా రి కోసం ఎంపీగా ఉన్న ప్పటి నుంచే వెంట పడుతు న్న. రెండు నెలల క్రితం కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తో సైతం ఆన్‌లైన్‌లో మాట్లాడిన. ఆయ న భూసేకరణ సమస్యను ప్రస్తావించారు. సిద్దిపేట నుంచి ఎల్కతు ర్తి వరకు భూ సేకరణ సమస్య లేదని చెప్పాం. దీంతో ఈ రోడ్డును మంజూరు చేశారు. ఇదికాకుండా కరీంనగర్‌, వీణవంక, జమ్మికుం ట, చిట్యాల, కామారెడ్డి, వేములవాడ, సిరిసిల్ల, కరీం నగర్‌, కామారెడ్డి, పిట్లం రోడ్లకు సైతం డీపీఆర్‌లను సమ ర్పించాం. ఇవి కూడా మంజూరు చేయాలి.

  • బోయినపల్లి వినోద్‌కుమార్‌, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మనకు మరో ఎన్ హెచ్

ట్రెండింగ్‌

Advertisement