e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home జనగాం కేసీఆర్‌ సీఎం కావడం రాష్ట్ర ప్రజల అదృష్టం

కేసీఆర్‌ సీఎం కావడం రాష్ట్ర ప్రజల అదృష్టం

కేసీఆర్‌ సీఎం కావడం రాష్ట్ర ప్రజల అదృష్టం

జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఆకుల శ్రీనివాస్‌
ఖాతాల్లో రైతుబంధు డబ్బుల జమ, ప్రజాప్రతినిధుల వేతనాల పెంపుపై హర్షం
ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం

దుగ్గొండి, జూన్‌ 16: ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్న కేసీఆర్‌ రాష్ర్టానికి ముఖ్యమంత్రి కావడం రాష్ట్ర ప్రజల అదృష్టమని జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఆకుల శ్రీనివాస్‌ అన్నారు. రైతుబంధు, రైతుబీమా పథకాలతో అన్నదాతల కుటుంబాలను ఆదుకుంటున్నందుకు కృతజ్ఞతగా బుధవారం మండలకేంద్రంలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి టీఆర్‌ఎస్‌ మండల కమిటీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ముఖ్య అతిథిగా ఆకుల శ్రీనివాస్‌ పాల్గొని మాట్లాడుతూ కేసీఆర్‌ పాలనలో పేద కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య, నల్లబెల్లి ఎంపీపీ ఊడుగుల సునీతాప్రవీణ్‌, ముదురుకోళ్ల కృష్ణ, నాయకులు పాల్గొన్నారు.
సుభిక్ష పాలన అందించడమే లక్ష్యం
వర్ధన్నపేట: తెలంగాణ ప్రజలకు సుభిక్ష పాలన అందించడమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యమని ఎంపీపీ అన్నమనేని అప్పారావు అన్నారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీల వేతన పెంపుపై హర్షం వ్యక్తం చేస్తూ ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఎంపీపీ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రైతులు, ప్రజల కష్టాలతోపాటు గ్రామస్థాయిలో పాలన సాగిస్తున్న ప్రజాప్రతినిధుల ఇబ్బందులను కూడా గుర్తించడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఎంపీపీ కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు అన్నమనేని ఉమాదేవి, దుగ్యాల జ్యోతి, గొడిశాల శ్రీనివాస్‌, చిలుముల్ల సోమయ్య, మంగ్యా, కోఆప్షన్‌ సభ్యులు సహీమ్‌ పాషా పాల్గొన్నారు.
వేతన పెంపుపై హర్షం
శాయంపేట: జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌ల గౌరవ వేతనాన్ని 30 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి మండల పరిషత్‌ కార్యాలయంలో పాలాభిషేకం చేశారు. అలాగే, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి చిత్రపటాలకు కూడా పాలాభిషేకం చేశారు. ప్రజాప్రతినిధుల సమస్యలను గుర్తించి గౌరవ వేతనం పెంచడంపై హర్షం వ్యక్తం చేశారు. ఎంపీపీ తిరుపతిరెడ్డి, ఎంపీటీసీ ఫోరం మండల అధ్యక్షుడు మేకల శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, అజ్మీరా రఘుసింగ్‌, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
లక్నేపల్లి గ్రామంలో..
నర్సంపేట: లక్నేపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి చిత్రపటాలకు ప్రజాప్రతినిధులు, అంగన్‌వాడీలు, ఆశ వర్కర్లు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వేతనాల పెంపుపై వారు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ గొడిశాల రాంబాబు, ఎంపీటీసీ సభ్యుడు వుల్లేరావు రజిత, అంగన్‌వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు, వీఏలు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కేసీఆర్‌ సీఎం కావడం రాష్ట్ర ప్రజల అదృష్టం
కేసీఆర్‌ సీఎం కావడం రాష్ట్ర ప్రజల అదృష్టం
కేసీఆర్‌ సీఎం కావడం రాష్ట్ర ప్రజల అదృష్టం

ట్రెండింగ్‌

Advertisement